Rakesh Jhunjhunwala: దివంగత ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా షేర్లు ఆయన లేకున్నా సంచలనాలను సృష్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు బిగ్ బుల్ కు చెందిన పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతూనే ఉన్నారు. తాజాగా ఆయన ఇన్వెస్ట్ చేసిన మరో కంపెనీ రికార్డుల మోత మోగిస్తోంది.

కొత్త ఏడాది.. కొత్త రికార్డు..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్ గురించి. గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు మంచి లాభాలను ఆర్జించాయి. దీంతో వాటి షేర్లు విలువ పెరిగి ఇన్వెస్టర్లకు సంపదను అందించాయి. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్ సైతం మంచి రాబడులను అందించింది. 6 నెలలుగా 80 శాతం పెరిగిన స్టాక్ నేడు సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. నేడు షేర్ దాదాపు 2% పెరిగి రూ.340.40కి చేరింది.

గతంలో స్టాక్..
ఈ రోజు కెనరా బ్యాంక్ షేర్లు దాదాపుగా 5 ఏళ్ల గరిష్ఠాన్ని తాకింది. దీనికి ముందు బ్యాంక్ ఫిబ్రవరి 2018లో రూ.340 స్థాయిని తాకింది. ప్రస్తుతం బ్యాంక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.171.75 వద్ద ఉంది. కెనరా బ్యాంక్ షేర్లు గత ఏడాదిలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలను అధిగమించడం ద్వారా ఆల్ఫా రాబడిని అందించాయి.

మార్కెట్ నిపుణుల టార్గెట్..
కెనరా బ్యాంక్ షేర్లు రానున్న కాలంలో రూ.380 వరకు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.315 స్థాయి షేర్ల కొనుగోలుకు ఉత్తమమైనదని వారు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ ధర రూ.370-380 స్థాయికి వెల్లడవచ్చని జీసీఎల్ సెక్యూరిటీస్ కు చెందిన రవి సింఘాల్ తెలిపారు. ఇది మార్చి 2023 చివరి నాటికి ఇన్వెస్టర్లకు రెండంకెల రాబడిని అందించగలదని ఆయన అన్నారు. పైగా రూ.297ను స్టాప్ లాస్ గా ఉంచుకోవాలని సూచించారు.

జున్‌జున్‌వాలా వాటాలు..
జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించిన షేర్‌హోల్డింగ్ సరళి ప్రకారం, వెటరన్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కెనరా బ్యాంక్‌లో 2,68,47,400 షేర్లు లేదా 1.48% వాటాను కలిగి ఉన్నారు.అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించి కెనరా బ్యాంక్ షేర్ హోల్డింగ్ విధానం ఇంకా రాలేదు.మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా 14 ఆగస్టు 2022న కన్నుమూశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications