కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు గతకొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం పసిడి ధరలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో సోమవారం (ఆగస్ట్ 3) టైటాన్ షేర్లు 3.26 శాతం ఎగిసి రూ.1,077 వద్ద ముగిశాయి. ఓ సమయంలో 4.4 శాతం పెరిగి రూ.1,089 చేరుకుంది. టైటాన్ ఇన్వెస్టర్లకు 4 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. కరోనా యంలో టైటాన్ సహా వివిధ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు భారీగా ఆదాయం వచ్చింది.

4 నెలల్లోరూ.1500 కోట్ల ఆదాయం
మార్చి 24వ తేదీన టైటాన్ రూ.720 కనిష్టం నుండి 50 శాతం ఎగిసింది. 2020లో టైటాన్ ఇప్పటి వరకు 9 శాతం క్షీణించింది. గత ఒక నెలలో 8 శాతం ఎగిసింది. ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్ ప్రకటించింది. జూన్ క్వార్టర్ ముగిసేనాటికి రాకేష్, ఆయన భార్య రేఖకు సంస్థలో 4.90 కోట్ల షేర్లు లేదా 5.53 శాతం వాటా ఉంది. టైటాన్ షేర్లు మార్చి కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు అతని పెట్టుబడుల వ్యాల్యూ రూ.3,528 కోట్లుగా ఉంది. గత శుక్రవారంతో ఇది రూ.5,112 కోట్లకు పెరిగింది. అంటే ఈ 4 నెలల కాలంలో రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చింది.

అంచనాలకు మించి రికవరీ.. మరింత వృద్ధి
జూన్ త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో రికవరీ అంచనాలకు మించి ఉందని టైటాన్ తెలిపింది. ఇతర డిస్‌క్రిషనరీ స్పెండింగ్స్‌తో పోలిస్తే జ్యువెల్లరీ దిశగా ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. కరోనా అనంతరం బంగారాన్ని మరింత సురక్షిత పెట్టుబడిగా, ఆస్తిగా భావిస్తున్న వారు పెరుగుతున్నారని చెబుతున్నారు. అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేయడం, అంతర్జాతీయ హాలీడే ట్రావెల్స్ తగ్గుతాయని, ఇది జ్యువెల్లరీ డిమాండ్ పెంపుకు దోహద పడుతుందని టైటాన్ కంపెనీ ఎండీ సీకే వెంకటరామన్ అన్నారు. ప్రయాణాలు, పెళ్లిళ్లకు ఖర్చులు తగ్గడంతో జ్యువెల్లరీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారని, దీంతో రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌కు అనుగుణంగా
కరోనా నుండి పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత వినియోగంలో పెరుగుదలను చూడవచ్చునని, ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వాచీలు సహా వివిధ విభాగాల్లో వృద్ధి కనిపించిందని చెబుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా టైటాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. గోల్డ్ కాయిన్, జ్యువెల్లరీకి డిమాండ్ ఉన్నప్పటికీ 2020లో పూర్తిస్థాయి డిమాండ్ రికవరీ అస్పష్టమేనని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications