IPO News: ధర వెల్లడించిన రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. ఎప్పుడొస్తోందంటే..?
Concord Biotech: ఈవారం సైతం అనేక ఐపీవోలు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇన్వెస్టర్లు సైతం నిరాశకు గురిచెందకుండా ఐపీవోలు రాబడులను అందిస్తుండటంతో ఆసక్తి పెరుగుతోంది.
ఈ క్రమంలో రాకేష్ జున్‌జున్‌వాలా మద్దతునిచ్చిన కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్ తన ఐపీవో కోసం షేరు ప్రైస్ బ్యాండ్ రూ.705-741గా నిర్ణయించింది. ఆగస్టు 4న మార్కెట్లోకి వస్తున్న ఐపీవో.. 8న ముగియనుంది. ఇదే క్రమంలో ఆగస్టు 3న యాకంర్ బుక్ తెరవబడుతుంది.

ప్రస్తుత ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,550 కోట్లను సమీకరిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ విలువ రూ.7,752 కోట్లుగా ఉంది. IPOలో హెలిక్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 20.93 మిలియన్ షేర్ల వరకు స్వచ్ఛమైన ఆఫర్-ఫర్-సేల్ ఉంది. కంపెనీ ఇన్వెస్టర్లకు ఆగస్టు 11న షేర్లను కేటాయిస్తుండగా అవి ఆగస్టు 17న షేర్లు పొందిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 18న ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి.
గత సంవత్సరం మరణించిన స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా తన అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ RARE ఎంటర్‌ప్రైజెస్ ద్వారా కంపెనీలో 24.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2004లో కాంకర్డ్ బయోటెక్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా, రేఖా జున్‌జున్‌వాలాలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కంపెనీ ఏపీఐ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు సరఫరా అవుతున్నాయి.
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మెరుగైన ఆదాయాలను నమోదు చేసింది. కంపెనీ ఆదాయం మునుపటి ఏడాదితో పోల్చితే 20 శాతం పెరిగి రూ.853.2 కోట్లుగా నమోదు కాగా.. లాభం 37.2 శాతం పెరిగి రూ.240 కోట్లుగా నిలిచింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జెఫరీస్ ఇండియా ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications