Baazar Style Retail IPO: చాలా కాలం తర్వాత రాకేష్-రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టి, వారి మద్ధతు కలిగిన కంపెనీ ఒకటి మార్కెట్లో లిస్టింగ్ అయ్యేందుకు వస్తోంది. దీంతో ఐపీవో మార్కెట్లో తిరిగి కోలాహలం నెలకొంది. అనేక మంది ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రేఖా రాకేష్ జున్‌జున్‌వాలా-మద్దతుగల బజార్ స్టైల్ రిటైల్ కంపెనీ ఐపీవో గురించే. ఇది తాజాగా మార్కెట్ల నుంచి మూలధన అవసరాల కోసం రూ.180 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP)ని దాఖలు చేసింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రేఖ రాకేష్ జున్‌జున్‌వాలా ద్వారా 27.2 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, ఇంటెన్సివ్ సాఫ్ట్‌షేర్స్ ద్వారా 22.4 లక్షల షేర్లు, ఇంటెన్సివ్ ఫైనాన్స్ 14.9 లక్షల షేర్లు, చందూర్కర్ ఇన్వెస్ట్‌మెంట్స్ 13.1 లక్షల షేర్లు అమ్మనున్నాయని సమాచారం.

ఐపీవోకి వస్తున్న కంపెనీలో అనేక ఇతర ప్రైవేట్ ఇన్వెస్టర్లకు సైతం ఇప్పటికే వాటాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ బిగ్ బుల్, దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా మరణంతో ఆయన పేరుపై అనేక కంపెనీల్లో ఉన్న ఈక్విటీ షేర్లు, పెట్టుబడులు.. నామినీగా ఉన్న భార్య రేఖా రాకేష్ జున్‌జున్‌వాలాకు బదిలీ చేయబడ్డాయి. బజార్ స్టైల్ రిటైల్ కంపెనీకి ప్రదీప్ కుమార్ అగర్వాల్, రోహిత్ కేడియా, శ్రేయాన్స్ సురానా, భగవాన్ ప్రసాద్, రాజేంద్ర కుమార్ గుప్తా, రాజేంద్ర కుమార్ గుప్తా (HUF), నర్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు.
ఆఫర్ ఫర్ సేల్ తర్వాత మిగిలిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపుతో పాటు ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. యాక్సిస్ క్యాపిటల్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, JM ఫైనాన్షియల్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా వ్యవహరిస్తున్నాయి. అలాగే లింక్ ఇన్‌టైమ్ ఇండియా ఇష్యూకి రిజిస్ట్రార్‌గా ఉంది.


Click it and Unblock the Notifications