Akasa Airline: స్టాక్ మార్కెట్ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ ఆగస్ట్ 7 నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. కంపెనీ తన మొదటి బోయింగ్ 737 మ్యాక్స్‌తో ఆకాశానికి ఎగిరేందుకు సిద్ధంగా ఉంది. ఇది మాత్రమే కాదు.. ఈ రంగానికి చెందిన దిగ్గజ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన ఇండిగో, గో ఫస్ట్ వంటి కంపెనీలకు కూడా కంపెనీ గట్టి పోటీదారుగా నిలుస్తోంది.

తక్కువగా ఆకాశ ఎయిర్‌లైన్ టిక్కెట్ ధర..
ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ అగ్రిగేటర్ ధరల డేటా ప్రకారం.. ఆగస్టు 17న ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో విమాన ఛార్జీలు కేవలం రూ.3,000గా ఉన్నాయి. ఇండిగో, గోఫస్ట్ రేట్ల కంటే ఇది 10 శాతం తక్కువ. ఆగస్ట్ 7న ఆకాశ ముంబై నుంచి బయలుదేరి 80 నిమిషాల తర్వాత అహ్మదాబాద్‌లో ల్యాండ్ అవుతోంది. ప్రస్తుతం ఆకాశ అందిస్తున్న టిక్కెట్ ఛార్జీ దాదాపు ఇండిగోతో సమానంగా ఉన్నాయి.

మార్కెట్ లీడర్ ఇండిగో పరిస్థితి..
ప్రస్తుతం దేశంలో అతిపెద్ద విమానయాన ఆపరేటర్ గా ఇండిగో సంస్థ ఉంది. ఎయిర్ ట్రావెల్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఇందులోనే ప్రయాణాలు చేస్తున్నారు. మార్కెట్లో మెుత్తంగా కంపెనీ 56 శాతం వాటాను కలిగి ఉంది. చాలా మార్గాల్లో చౌకైన విమాన సేవలకు అందిస్తూ కంపెనీ ప్రయాణికుల ఆధరణ పొందుతోంది.

కొచ్చి-బెంగళూరు రూట్లో సరసమైన ధరలు..
ఆగస్టు 12న కూడా కొచ్చి-బెంగళూరు రూట్‌లో ప్రయాణించాలని ఆకాశ ప్లాన్ చేస్తోంది. ఆగస్ట్ 19న ముంబై, బెంగళూరులను కలుపుతూ ఆకాశ విమానాలను ప్రారంభించనుంది. ఈ మార్గంలో ఆకాశ విమానయాన సంస్థ అతి తక్కువ ధరలకే సేవలను ఇందిస్తోంది. ఇటీవలి వరకు, ఈ ప్రాంతాల్లో చౌకైన ఛార్జీలతో ఇండిగో లేదా ఎయిర్‌ఏషియా ఇండియా ఆధిపత్యంలో ఉండేవి. బుకింగ్ ప్రారంభించే సమయంలో ఎయిర్‌లైన్ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ.. తాము విశ్వసనీయమైన, నమ్మదగిన నెట్‌వర్క్, సరసమైన ధరలతో వస్తున్నట్లు ప్రకటించారు.

తగ్గిన ఏటీఆర్ ఇంధన ధరలు...
ఇంత పోటీ సమయంలో కంపెనీలకు ఊరటనిచ్చే వార్త ఏమిటంటే.. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు 2 శాతం తగ్గటమే. ATF ధరలలో తగ్గుదల ధోరణి కొనసాగితే, దేశీయ మార్కెట్లో పెరుగుతున్న పోటీ మధ్య విమానయాన సంస్థ ఛార్జీలను తగ్గించవచ్చు. ఇది వాటి మధ్య పోటీని మరింతగా పెంచటంతో పాటు ప్రయాణికులకు లాభాన్ని కలిగిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications