Rajiv Swagruha Flats: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ టౌన్‌షిప్‌లలో నిల్వలో ఉన్న ఫ్లాట్లను భారీ స్థాయిలో అమ్మకానికి తెరలేపిన సంగతి విదితమే. బండ్లగూడ, పోచారం, గాజులరామారం ప్రాజెక్టులలోని వేల ఫ్లాట్లు, ప్లాట్‌లు ఇప్పుడు అమ్మకానికి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ఫ్లాట్ల విక్రయాల ద్వారా ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. బండ్లగూడ, పోచారంలో తక్కువ ధరల ఇళ్ల విక్రయం ప్రారంభం కానున్నాయి.
నగరంలో మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకంలో నిర్మించిన ఫ్లాట్లను లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు అందిస్తోంది. ఈ ఫ్లాట్ల విక్రయంపై హైదరాబాద్ నగరవాసుల్లో ఆసక్తి భారీగా పెరుగుతోందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి. భాస్కర్ రెడ్డి తెలిపారు.

బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఫ్లాట్లు మార్కెట్ ధరల కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని ఆయన చెబుతున్నారు.బండ్లగూడ (Nagole-Bandlaguda) లో 159 ఫ్లాట్లు, పోచారం (Pocharam)లో 601 ఫ్లాట్లు ఈ సారి మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.బండ్లగూడ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 1200 మంది ప్రభుత్వ అధికారిక నంబర్ మీద ఫోన్‌లో సంప్రదించారు. ఇక 700 మంది ఈ ప్రాజెక్టును స్వయంగా సందర్శించారు. మరో ఏరియా పోచారం ఫ్లాట్లకు సంబంధించిన 800 మంది ప్రభుత్వానికి కాల్ చేసి విచారించారు. దాదాపు 300 మంది వరకు ఫ్లాట్లు ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు.
బండ్లగూడ ఫ్లాట్లకు దరఖాస్తుల స్వీకరణ జూలై 29 వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని లాటరీ జూలై 30న తీయనున్నారు. ఇక పోచారం ఇళ్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జూలై 31 వరకు ఉండగా లాటరీ ఆగస్టు 1న తీయనున్నారు. తక్కువ ధరలోనే సొంతింటి కలను నెరవేర్చుకునే ఈ అద్భుత అవకాశాన్ని మధ్యతరగతి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి. భాస్కర్ రెడ్డి కోరుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 2007లో ప్రారంభమైన రాజీవ్ స్వగృహ పథకం ఉద్దేశ్యం పట్టణాలు, నగర శివార్లలోని మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన గృహాలు అందించడం. అయితే గతంలో నిర్వహించిన ఆరు వేలం దశల్లో కూడా వందలాది ఫ్లాట్లు, వేల ప్లాట్‌లు అమ్ముడుకాలేదు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి మార్కెట్‌కు తీసుకురావడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోంది.ఈ ఫ్లాట్లు సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రస్తుత అమ్మకానికి ఉన్న యూనిట్లు
పోచారంలొ సద్భావన టౌన్‌షిప్: 601 ఫ్లాట్లు
బండ్లగూడలో సహభావన టౌన్‌షిప్: 159 ఫ్లాట్లు
గాజులరామరం టవర్లు (9-14 అంతస్తులు, అసంపూర్తి యూనిట్లు సహా): 418 ఫ్లాట్లు
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications