కూలీ మూవీ చూడమని ఉద్యోగులకు సెలవు..పాప్ కార్న్, కూల్ డ్రింక్స్‌కు కూడా డబ్బులు..
Coolie Movie Latest News: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విజయవంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రివ్యూలు విడుదలయి అంచనాలను మరింతగా పెంచాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, శ్రుతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు నటించారు. నిరుధ్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బాస్టర్ అయింది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా కూలి సినిమా విడుదల కానుండటంతో సినీ అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు ఆఫీసులకు సెలవులు కూడా పెడుతున్నారు. టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.. అయితే సింగపూర్ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవును ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సెలవు రొజు కూడా వేతనం ఇస్తామని మరో సంచలన ప్రకటన కూడా చేసింది.

సింగపూర్‌కు చెందిన ఫార్మర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ తన ఉద్యోగులకు ఆగస్టు 14న కూలి సినిమా విడుదల దృష్ట్యా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఆ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సూపర్ స్టార్ సినిమా కూలి 14న విడుదల అవుతుందని పేర్కొంది.దీంతో కంపెనీలో పనిచేస్తున్న తమిళ ఉద్యోగులకు ఆగస్టు 14 జీతంతో కూడిన సెలవు దినంగా ఉంటుందని ప్రకటించింది.
దీనితో పాటు..కంపెనీ తన ఉద్యోగుల కోసం ప్రీమియర్ మొదటి రోజు టిక్కెట్లను కూడా కొనుగోలు చేసింది. సినిమా విరామ సమయంలో తమ ఉద్యోగులకు పాప్‌కార్న్, పానీయాల కోసం 30 డాలర్లు అందిస్తామని కూడా ప్రకటించింది. సింగపూర్ కంపెనీ తీసుకున్న నిర్ణకయంపై రజనీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా.. భారతదేశంలోని కంపెనీలు, ముఖ్యంగా తమిళనాడుకు చెందిన కంపెనీలు, రజనీకాంత్ చిత్రాల విడుదలకు సెలవులు ఇస్తాయి. ఇప్పుడు సింగపూర్‌లో కూడా ఈ ట్రెండ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
ఇక తమిళనాడులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యునో ఆక్వా కేర్ అనే కంపెనీ.. ఉద్యోగులు కూలీ సినిమా చూడటానికి తప్పుడు సాకులతో సెలవు తీసుకోకూడదని, మేమే సెలవు ప్రకటిస్తామని తెలిపింది. ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులో.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీ విడుదలకు సంబంధించి ఆగస్టు 14న సెలవు ప్రకటిస్తామని, ఉద్యోగులకు టిక్కెట్లు కూడా అందిస్తామని కంపెనీ ప్రకటించింది
రజనీకాంత్ సినీ పరిశ్రమలో 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారాన్ని అందించడంతో పాటు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేయడం ద్వారా ఒక వేడుకను నిర్వహించినట్లు యునో ఆక్వా కేర్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూలి సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications