IPO News: ఐపీవో తొలి రోజు సూపర్ లాభాలు.. పండుగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
IPO News: ఈరోజు మార్కెట్లోకి ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఐపీవో లిస్టింగ్ అయ్యింది. మార్కెట్లోకి అడుగుపెట్టగానే బలమైన లాభాలను స్టాక్ అందించటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మార్కెట్లో బంపర్ లిస్టింగ్ నమోదు చేసిన రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ IPO గురించే. ఐపీవోలో షేర్లను పొందిన పెట్టుబడిదారులు తొలిరోజే ఏకంగా 22 శాతం లాభాన్ని పొందారు. రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ ఐపీవో 18 శాతం ప్రీమియంతో ఒక్కో షేరుకు రూ.59 చొప్పున NSEలో లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ జరిగిన కొద్దిసేపటికే ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠ స్థాయి రూ.61ని తాకింది.

వాస్తవానికి రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ ఐపీవో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధర 47 నుంచి 50గా ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి 20 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో తెరిచి ఉంది. అక్టోబరు 26న ఐపీవోలో షేర్ల కోసం దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగింది. రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ IPOలో ఒక లాట్ పరిమితి 3000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో ఒక్క లాట్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు రూ.1.50 లక్షలు పెట్టుబడిగా పెట్టారు.
తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.47.81 కోట్లను సమీకరించింది. ఇందుకోసం ఐపీవోలో మెుత్తం 88.95 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.13.56 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఐపీవో చివరి రోజున 107.43 సార్లు సబ్ స్క్రిప్షన్ పొందింది.


Click it and Unblock the Notifications