జీవితంలో స్థిరమైన ఉద్యోగం, సురక్షితమైన ఆదాయం చాలామందికి ఆకాంక్ష. కానీ కొంతమంది మాత్రం తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ సౌలభ్యాన్ని వదిలేస్తారు. అలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని, విజయాన్ని అందుకుని అందరికీ ఉదాహరణగా నిలిచాడు రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు. అతను నెలకు రూ. 1.3 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, ఇప్పుడు రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు.. అది కూడా తన సొంత హోమ్‌స్టే వ్యాపారం ద్వారా అంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఇటీవల ఈ Rajasthan యువకుడు తన అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నాడు. నా 9 నుంచి 5 గంటల ఉద్యోగం తర్వాత నా నెలవారీ ఆదాయం నా పాత జీతాన్ని దాటింది అనే శీర్షికతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. గత సంవత్సరం నేను నా రూ.1.3 లక్షల జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి, రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతాల్లో హోమ్‌స్టే వ్యాపారం ప్రారంభించాను. పెద్ద ప్రణాళిక ఏమీ లేదు.. కానీ నా చేతుల మీదుగా ఏదో నిర్మించాలి, ఎక్కువగా ప్రయాణించాలి అనే కోరిక మాత్రమే ఉందని గుర్తు చేసుకున్నాడు.

మొదటి కొన్ని నెలలు చాలా కష్టంగా గడిచాయి. సందేహాలు, అసమాన ఆదాయం, భయం.. ఇవన్నీ ప్రతి రోజు సవాలు లా అనిపించేవి. అయినా కూడా ఆయన ఆగలేదు. నెమ్మదిగా తన హోమ్‌స్టే నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ, అతిథులకు మంచి అనుభవం అందించడంపై దృష్టిపెట్టాడు. ఒక సంవత్సరం కృషి తర్వాత, ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చెబుతున్నట్లుగా ఈ నెలలో నా Airbnb బుకింగ్‌ల ద్వారానే రూ. 2.18 లక్షలు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ. 2.5 లక్షలు దాటింది. ఇది నా పాత జీతం కంటే దాదాపు రెట్టింపు అని చెప్పుకొచ్చాడు.
అయితే ఇది రాత్రికి రాత్రే సాధించిన విజయం కాదు. దీనికి నెలల తరబడి ఓపిక, నిరంతర కృషి, పొదుపు, ప్రతిదీ స్వయంగా నేర్చుకోవడం అవసరమైందని ఆయన పేర్కొన్నాడు.అలాగే ఇలాంటి కథలు నాకు కూడా ఒకప్పుడు స్ఫూర్తినిచ్చాయి. అందుకే ఈ మైలురాయిని పంచుకోవాలనిపించిందని చెప్పాడు. రెడ్డిట్‌లో ఈ పోస్ట్ పంచుకున్న తర్వాత, వేలాది మంది ఆన్‌లైన్ వినియోగదారులు ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను అభినందించారు.
ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ..కాలంతో పరిగెత్తే పోటీ నుంచి బయటపడటానికి మీరు తీసుకున్న సాహసోపేత నిర్ణయం అద్భుత అని అన్నారు. వ్యవస్థాపక ప్రయాణం చాలా కష్టం. కానీ ఒకసారి ప్రారంభిస్తే అది జీవితంలోనే ఉత్తమమైన ప్రయాణం అవుతుంది. మీ విజయానికి అభినందనలు అని మరొక నెటిజన్ తెలిపారు. నిరంతర జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి, ఎటువంటి స్థిర ఆదాయం లేకుండా కొత్తగా ప్రారంభించడం చాలా ధైర్యం కావాలని మరొక నెటిజన్ చెప్పుకొచ్చారు.
స్థిరమైన ఉద్యోగం ఉన్నా, మన కలలపై నమ్మకం ఉంచి కృషి చేస్తే, విజయం సాధ్యమే. ఆయన చెప్పినట్టే అది త్వరగా జరగదు, కానీ పట్టుదలతో కొనసాగితే తప్పక జరుగుతుందని ఈ యువకుడి కథ నిరూపిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications