టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హార్రర్-కామెడీ మూవీ రాజాసాబ్ (Raja Saab) మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న నిర్మాతలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తెలంగాణ హైకోర్టులో టికెట్ ధరలపై వేసిన అప్పీలు.. ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.

హైకోర్టులో టికెట్ ధరల యుద్ధం!
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడం ఆనవాయితీ. కానీ, ఈసారి రాజాసాబ్ (Raja Saab) నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ షాక్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపును నిరాకరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఇప్పుడు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. కేవలం రాజా సాబ్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' నిర్మాతలు కూడా ఇదే బాటలో నడిచారు. ఈ బుధవారం (జనవరి 7) కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఓపెనింగ్ డే కలెక్షన్ల లెక్కలు ఆధారపడి ఉన్నాయి.
రూ. 1000 టికెట్.. ప్రీమియర్ షోల క్రేజ్!
జనవరి 8 న ప్రదర్శించబోయే పెయిడ్ ప్రీమియర్ షోల కోసం అభిమానుల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మల్టీప్లెక్స్ లో రూ. 1,000, సింగిల్ స్క్రీన్ లో రూ. 800 రేట్లకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు సులభంగానే వచ్చినప్పటికీ, తెలంగాణ (నైజాం) రీజియన్‌లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
ఓవర్సీస్‌లో ప్రభాస్ ప్రభంజనం!
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో రాజా సాబ్ (Raja Saab) కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నార్త్ అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 5.9 లక్షల డాలర్లు (దాదాపు రూ. 5 కోట్లు) వసూలు చేయడం విశేషం. ఇప్పటికే 20,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
బాక్సాఫీస్ టార్గెట్
ఈ సినిమా దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివితో వస్తోంది. హార్రర్-కామెడీ జానర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విదేశీ మార్కెట్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 10 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. సంక్రాంతి రేసులో 'జన నాయకన్' (విజయ్), 'మన శంకర వర ప్రసాద్ గారు' వంటి భారీ పోటీ ఉన్నప్పటికీ, ప్రభాస్ మేనియా ఈ సినిమాను గట్టెక్కిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
బిజినెస్‌కు కీలకమైన 24 గంటలు
బాక్సాఫీస్ వద్ద రాజాసాబ్ (Raja Saab) భారీ కలెక్షన్లు రాబట్టాలంటే.. తెలంగాణలో టికెట్ ధరల పెంపు అత్యంత అవసరం. కోర్టు తీర్పు సానుకూలంగా వస్తేనే భారీ బడ్జెట్ రికవరీ సాధ్యమవుతుంది. పండగ పూట ఇటు సామాన్యులకు టికెట్ ధరల భారం పడకుండా, అటు నిర్మాతలకు లాభాలు వచ్చేలా ఎలాంటి మధ్యేమార్గం వస్తుందో చూడాలి!
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications