1995లో మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు కొనడం, పిల్లల చదువు రెండూ పెద్ద భారం కాకుండా సాధ్యమయ్యేవి. కానీ 2025లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక పిల్లను పెంచడం అంటే ఒక ఇల్లు కొన్నంత ఖర్చు అవుతోంది. ఇదే నేటి అర్బన్ ఇండియాలోని కఠిన సత్యం. పిల్ల పెంపకం ఇప్పుడు "హై-రిస్క్ ఫైనాన్షియల్ డీల్" గా మారిపోయింది.

ఏంజెల్ ఇన్వెస్టర్ అభిషేక్ చెబుతున్నట్టు, నేటి అర్బన్ ఇండియాలో ఒకరిని పెంచడానికి మొత్తం ఖర్చు దాదాపు రూ. 45 లక్షలు అవుతోంది. అదే ఒక టైర్ 2 సిటీలో లగ్జరీ ఫ్లాట్ ఈ ధరతో వచ్చేస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ప్రేమ లేదా వారసత్వం మాత్రమే కాదు ఇక ఇది ఒక ఫైనాన్షియల్ డిసిషన్. ఒకరిని పెంచాలా? లేక ఇల్లు కొనాలా? రిటైర్మెంట్‌ను సురక్షితంగా చేసుకోవాలా? లేక అప్పులలో మునగాలా? అనేది ప్రశ్నగా మారిపోయింది.
20 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఇల్లు కూడా కొనేసింది, పిల్లల చదువు కూడా సులభంగా చూసుకుంది. కానీ 2025లో? రెండింట్లో ఒక్కటి మాత్రమే సాధ్యం. జాగ్రత్తగా ఎంచుకోవాలి," అని ఏంజెల్ ఇన్వెస్టర్ అభిషేక్ కె తన 'లింక్డ్ఇన్' పోస్టులో రాశాడు. ఈ మాటలు మధ్యతరగతి కుటుంబాలను బాగా తాకింది.
ఇప్పుడు ఒక పిల్లవాడిని చదివించడం చిన్న విషయం కాదు. 6 నుండి 17 ఏళ్ల వయసులో పిల్లల విద్య కోసం మాత్రమే సగటుగా రూ.17 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇది కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే ఇందులో కాలేజ్ ఫీజులు లేవు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఏటా రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ఉంటాయి. ఇంక మెట్రో నగరాల్లో డే కేర్ సెంటర్లు నెలకు రూ. 20,000 వరకు తీసుకుంటున్నాయి. అంటే మధ్యతరగతి తల్లిదండ్రులు ప్రతి నెలా తమ జీతంలో పెద్ద భాగాన్ని పిల్లలకే కేటాయించాల్సి వస్తోంది.
అదొక్కటే కాదు చదువుతో పాటు వచ్చే యాక్టివిటీలు కూడా పెద్ద ఖర్చే. ఒలింపియాడ్స్, డ్యాన్స్ క్లాసులు, క్రికెట్ కోచింగ్, ఐఐటి ఇలా ఒక్కొకటి కనీసం రూ. 25,000 నుంచి రూ. 50,000 దాకా పోతుంది. పిల్లలకు ఇవన్నీ అవసరమని తల్లిదండ్రులు అనుకుని, అప్పు తీసుకోని మరి ఈ ఖర్చులు భరిస్తున్నారు.
ఇక మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ మరింత ఒత్తిడి పెడుతోంది. ఇండియాలో హెల్త్‌కేర్ ఇన్ఫ్లేషన్ రేట్ 14% ఉంది. ఆసియాలోనే ఇది అత్యధికం. చిన్న ఆరోగ్య సమస్యలలకు కూడా పెద్ద బిల్లులు వస్తున్నాయి. బీమా ఉన్నా లేకపోయినా కుటుంబాలు చాలా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
సర్వేలు చెబుతున్నట్టుగా, ఒక పిల్లను పెంచడానికి మధ్యతరగతి ఆదాయంలో 57% వరకు వెళ్తోందట. అంటే రిటైర్మెంట్ కోసం సేవింగ్స్, ఇల్లు కొనే ప్లాన్స్, లేదా ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ వెనకబడిపోతున్నాయి.
విద్యా ఖర్చుల తర్వాత పెళ్లిళ్లు మరో పెద్ద బాంబుల్లాంటివి. ఒక పెళ్లికి సగటు ఖర్చు రూ. 80 లక్షల వరకు పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు స్కూల్ ఫీజులకే EMI ఆప్షన్లు వచ్చాయి. అంటే పెరెంటింగ్ = అప్పు అనేది సహజంగా కనిపిస్తోంది.
అసలు సమస్య ఎక్కడ?
అభిషేక్ అభిప్రాయం ప్రకారం, కుటుంబాల తప్పు కాదు. సమస్య సిస్టమ్‌లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలనే ఎంచుకోవాల్సి వస్తోంది. పైగా సోషల్ మీడియా ప్రెషర్ తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో "పిల్ల ఎనిమిదేళ్లకే కోడింగ్ నేర్చుకోకపోతే మీరు మంచివాళ్లు కాదు" అన్నట్టుగా చూపించడం కూడా ఒక పెద్ద వల మీరు అందులో పడకుండా ఉండటం మంచిది.
అభిషేక్ సందేశం చాలా క్లియర్ గా ఉంది. ప్రైవేట్ స్కూల్ పై కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టాలి. బ్రాండ్ టాయ్స్ మీద కాకుండా కాంపౌండ్ ఇంటరెస్ట్ నేర్పాలి. అసలైన రక్షణ అంటే సోషల్ ఎక్స్‌పెక్టేషన్ కోసం ఆర్థిక స్వేచ్ఛను త్యాగం చేయకుండా వేరేలా ఆలోచించడం ఇప్పుడు అసలు రక్షణ.
More From GoodReturns

రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications