Railways: భారతీయులు విరివిగా ఉపయోగించే రవాణా సాధనాల్లో రైల్వే ప్రథమ స్థానంలో ఉంటుంది. అయితే ఆ శాఖ అందించే కొన్ని సౌకర్యాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. వాటిలో రిటైరింగ్ రూమ్స్ సర్వీస్ ఒకటి. రైలు ఎక్కే ముందు లేదా ప్రయాణం పూర్తైన తర్వాత కొంచెం ఫ్రెష్ అయి వెళ్లిన పని చూసుకునే వారు ఎందరో ఉంటారు. వారు పెద్ద మొత్తం వెచ్చించి బయట హోటల్స్ లో బస చేయాలి. ఇటువంటి వారికి రిటైరింగ్ రూమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
దేశంలోని అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ సర్వీసును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. సింగిల్, డబుల్ రూమ్స్ తో పాటు డార్మెటరీలు సైతం అందుబాటులో ఉన్నాయి. AC మరియు నాన్-ఏసీలో నచ్చిన రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే సదరు ప్రయాణికుడు ఖచ్చితంగా కన్ఫమ్ టికెట్ కలిగి ఉండాలి.

ఈ రిటైరింగ్ రూమ్స్ ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు ఇవి కేవలం సోర్స్ మరియు డెస్టినేషన్ స్టేషన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. IRCTC సైట్ లో లాగిన్ అయ్యి చెక్-ఇన్, చెక్-అవుట్ తేదీలు ఆధారంగా AC లేదా నాన్ AC గదులను బుక్ చేసుకోవచ్చు.డిమాండ్ ఆధారంగా 100 నుంచి 700 వరకు రూమ్స్ రేట్లు మారుతూ ఉంటాయి.
ఏదైనా కారణం రూమ్ రద్దు చేసుకోవాలంటే, బుక్ చేసుకున్న 48 గంటల్లోపు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేవలం 10 శాతాన్ని క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు. అదేరోజు అయితే 50 శాతం మాత్రమే రీఫండ్ పొందగలం. ఈ రూమ్స్ లో 2 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. ఒకవేళ టికెట్స్ వెయిట్-లిస్ట్‌లో ఉంటే రూమ్స్ బుక్ చేసుకోవడానికి అనుమతించరు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications