న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ వినిపించింది. కోట్లాదిమంది ప్రయాణికులకు లబ్ది కలిగించే వార్త ఇది. రైళ్ల టికెట్లు బుకింగ్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని అప్‌డేట్ చేసింది. రైలు టికెట్లు బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉన్న పరిమితి..6. అంటే ఆధార్ కార్డ్‌తో లింక్ లేని యూజర్ ఐడీ ద్వారా ప్రతినెలా ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకునే వీలు ఉండేది. ఈ పరిమితిని తాజాగా పెంచుతున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. 12 టికెట్ల వరకు బుక్ చేసుకునే వెసలుబాటును కల్పించింది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి ఆధార్ కార్డ్‌తో లింక్ ఉన్న యూజర్ ఐడీ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిమితి 12.. దీన్ని కూడా రెట్టింపు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్యను 24కు పెంచినట్లు వెల్లడించింది. వెరిఫైడ్ ఆధార్ కార్డ్ లింక్ ఉన్న యూజర్ ఐడీ ద్వారా ప్రతినెలా 24 టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది.

ఐఆర్‌సీటీసీలో రిజిస్టర్ అయిన యూజర్ ఐడీ వినియోగదారులు మై ప్రొఫైల్ ద్వారా తమ ఆధార్ కార్డ్ వివరాలు, కేవైసీని అప్‌డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్‌కు ఓటీపీని పొందుపరచడం ద్వారా ఆధార్ కార్డ్‌తో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. దీనికోసం ఆధార్ కార్డ్‌లో పొందుపరిచిన మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ ఒకటే అయివుండాలి.
ఆధార్ కార్డ్‌ను యూజర్ ఐడీతో లింక్ చేసుకునే వారు ఇకపై ప్రతినెలా 24 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ లేని వారు 12 టికెట్లు మాత్రమే ప్రతినెలా బుక్ చేసుకోగలుగుతారు. ఇదే విధానం ఐఆర్‌సీటీసీ యాప్‌కు కూడా వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications