Buzzing Stocks: G20 నిర్ణయంతో తుఫానుగా మారిన స్టాక్స్.. మీరూ కొన్నారేమో చూసుకోండి..
Buzzing Stocks: భారత్ వేదికగా సెప్టెంబర్ 9, 10 రాజధాని దిల్లీలో జీ20 సదస్సు నిర్వహించబడింది. అయితే దీనిలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ భారీ స్కెట్ వేసింది. దీంతో ఒక రంగానికి చెందిన షేర్లు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో రైల్వే రంగంలోని కంపెనీల షేర్లు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈ రంగంలోని కంపెనీల షేర్లు గరిష్ఠంగా 18 శాతం మేర పెరిగాయి. జీ20 సదస్సులో అమెరికా, సౌదీ అరేబియా, భారత్, యూరోపియన్ యూనియన్ రైల్ కారిడార్ పై తీసుకున్న నిర్ణయంతో రైల్వే స్టాక్స్ విపరీతమైన కొనుగోళ్లను చూస్తున్నాయి. ఈ ఒప్పందం అరబ్ దేశాలు, దక్షిణాసియా మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయగలదు. మధ్యప్రాచ్య దేశాలను రైల్వేలతో అనుసంధానం చేయడం, భారతదేశాన్ని ఓడరేవులతో అనుసంధానించడం దీని లక్ష్యం.

ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లు సోమవారం బీఎస్ఈలో 18% పైగా పెరిగి రూ.159.25కి చేరాయి. సోమవారం ట్రేడింగ్ సమయంలో కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇదే క్రమంలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(RVNL) షేర్లు సోమవారం 15 శాతానికి పైగా పెరిగాయి. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.191.40కి చేరాయి. ఈ క్రమంలో రైల్ వికాస్ నిగమ్ షేర్లు కూడా తమ కొత్త 52 వారాల గరిష్ఠ ధరను తాకాయి.

ఇదే క్రమంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 10% మేర లాభపడ్డాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఆర్‌ఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ తొలిసారిగా 1.10 లక్ష కోట్ల రూపాయలను తాకింది. ఏడు రోజుల్లో స్టాక్ 68 శాతం మేర లాభపడటంతో రూ.84.76కి చేరాయి. అలాగే టిటాగర్ రైల్ సిస్టమ్స్ స్టాక్ ధర ఇంట్రాడేలో 5 శాతం మేర పెరిగాయి. బీఎస్ఈలో స్టాక్ ధర రూ.855 వద్దకు చేరుకుంది. టెక్స్‌మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ షేర్లు 5.5 శాతం పెరిగి రూ.163.85కి చేరాయి. రైట్స్ లిమిటెడ్ షేర్లు 3% కంటే ఎక్కువ జంప్‌తో రూ.566కి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications