Oriental Rail share: దేశీయంగా ఇన్వెస్టర్లు చాలా కాలంగా రైల్వే రంగంలోని కంపెనీల షేర్లపై బెట్టింగ్ వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను వేగంగా మెరుగుపరుస్తున్న వేళ అవి మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి.
ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతం పెరిగి ఒక్కో షేరు రూ.397.45కి చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. గత 5 రోజుల్లో ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 21% కంటే ఎక్కువ పెరిగాయి. కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని ఓరియంటల్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ రైల్వే నుంచి రూ.432.16 కోట్ల భారీ ఆర్డర్‌ను పొందినట్లు సమాచారం. ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 21 పైసల నుంచి దాదాపు రూ.400 స్థాయికి చేరుకోనున్నాయి.

ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత కొన్నేళ్లుగా విపరీతమైన రాబడిని అందిస్తున్నాయి. 20 ఏళ్ల కిందట కంపెనీ షేర్లు డిసెంబర్ 3, 2004లో ఒక్కోటి కేవలం 21 పైసలుగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు రూ.400కి చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ షేర్లు 189160% రాబడిని అందించాయి. గత ఏడాదిలో ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 575% పెరిగాయి. జూలై 12, 2023న కంపెనీ షేర్లు రూ.58.80 వద్ద ఉన్నాయి.
ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 1200 వ్యాగన్‌లను తయారు చేసేందుకు ఆర్డర్ అందుకుంది. ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇటీవల భారతీయ రైల్వే నుంచి రూ.19.33 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకుంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా నుండి రూ.19.33 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకున్నట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ క్రమంలో ఆ కంపెనీ భారతీయ రైల్వేలకు సీట్లను తయారు చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications