Bengaluru News: నేడే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం.. స్టాప్స్, ట్రైన్ టికెట్ ధరలు ఎంత ఉన్నాయంటే..!

ఎట్టకేలకు బెంగళూరు, ముంబై వందే భారత్ స్లీపర్ ప్రారంభానికి వేళైంది. ఈ రోజు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరు, ముంబై మద్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. ఈ రైలు రాత్రి సమయంలో నడవనుంది. రైలును బెంగళూరులో ప్రారంభించనున్నారు. రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT బెంగళూరు) నుంచి బయలుదేరి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (CSMT)కు చేరుకుంటుంది. ఈ సేవలను సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) జోన్ పర్యవేక్షించనుంది.

ఈ ట్రైన్ రెండు రైలు నంబర్లతో నడవనుంది. 27652 (SMVT బెంగళూరు - CSMT ముంబై), 27651 (CSMT ముంబై - SMVT బెంగళూరు). ఈ రైళ్లు వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు-ముంబై సర్వీసు సోమవారాల్లో ముంబై-బెంగళూరు సర్వీసు మంగళవారాల్లో నడవవు. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 16 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం రైలు నంబర్ 27652 సాయంత్రం 7:45 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు CSMT ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 రాత్రి 8:10 గంటలకు CSMT ముంబై నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది.

Vande Bharat Sleeper

ఈ రైలు మార్గమధ్యంలో అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ అనే ఎనిమిది స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు-ముంబై ప్రయాణంలో మధ్యంతర స్టేషన్లలో రైలు రాక, బయలుదేరే సమయాలు ఇలా ఉన్నాయి. అనంతపురం (రాత్రి 10:28 చేరుకుని/10:30 బయల్దేరుతుంది), గుంతకల్లు (రాత్రి 11:20/11:25), రాయచూరు (తెల్లవారుజామున 1:03/1:05), యాద్గిర్ (తెల్లవారుజామున 1:43/1:45), కలబురగి (తెల్లవారుజామున 3:08/3:10), సోలాపూర్ (తెల్లవారుజామున 4:20/4:25), పూణే (ఉదయం 8:00/8:05), కళ్యాణ్ (ఉదయం 10:42/10:44).

ముంబై నుంచి బెంగళూరుకు తిరుగు ప్రయాణంలో ఈ రైలు కళ్యాణ్ (రాత్రి 8:48/8:50), పూణే (రాత్రి 11:40/11:45), సోలాపూర్ (తెల్లవారుజామున 3:00/3:05), కలబురగి (తెల్లవారుజామున 4:13/4:15), యాద్గిర్ (తెల్లవారుజామున 5:08/5:10), రాయచూరు (ఉదయం 6:03/6:05), గుంతకల్లు (ఉదయం 7:30/7:35) మరియు అనంతపురం (ఉదయం 8:38/8:40) స్టేషన్లలో ఆగుతుంది.
27652 నంబర్ రైలుకు నవంబర్ 3న, 27651 నంబర్ రైలుకు నవంబర్ 2న సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలులో ఏసీ 3-టైర్ (AC 3-Tier), ఏసీ 2-టైర్ (AC 2-Tier), ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class) మూడు తరగతుల వసతులు అందుబాటులో ఉంటాయి.

ప్రశ్నలు, జవాబులు

బెంగళూరు-ముంబై ప్రయాణానికి టికెట్ ధరలు

ఏసీ 3-టైర్‌కు రూ. 2,810, ఏసీ 2-టైర్‌కు రూ. 3,630, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ. 4,450.

రైలులో ఎంత ప్రయాణం చేయవచ్చు

ఈ రైలులో మొత్తం 823 మంది ప్రయాణీకుల సామర్థ్యం ఉంటుంది. ఇందులో ఏసీ 3-టైర్‌లో 611 బెర్త్‌లు, ఏసీ 2-టైర్‌లో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి.

టికెట్ల బుకింగ్ ఎలా

టిక్కెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజర్వేషన్ల కోసం, ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా రైల్ కనెక్ట్, రైల్ వన్ మొబైల్ యాప్‌లను ఉపయోగించవచ్చు. రైల్వే స్టేషన్లలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు ఏమిటి?

ఈ కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌ల రేక్‌తో నడుస్తుంది. ఈ రైలులో మెరుగైన కుషనింగ్‌తో ఎర్గోనామికల్‌గా డిజైన్ చేయబడిన బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, ప్రయాణీకులు కోచ్‌ల మధ్య మారడానికి వీలుగా వెస్టిబ్యూల్స్ ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+