Railway Board: రైల్వే ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. భత్యాల తగ్గింపునకు సన్నాహాలు..! ప్లాన్ ఇదే..
Railway Board: రైల్వే బోర్టు తాజా నిర్ణయం త్వరలో ఉద్యోగులకు పెద్ద షాక్ ఇవ్వనుంది. ఎందుకంటే వారికి చెల్లిస్తున్న ప్రస్తుత భత్యాలను తగ్గించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు రైల్వేలు ఇలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్చుల తగ్గింపు కోసం..
భారతీయ రైల్వేలలో పెరుగుతున్న పని ఖర్చుల గురించి ఆందోళన పెరుగుతోంది. ఓవర్‌టైమ్, నైట్ డ్యూటీ, ప్రయాణం, ఇంధనం, నిర్వహణ కోసం ఉద్యోగుల అలవెన్సుల ఖర్చులను పరిశీలించాలని రైల్వే బోర్డు ఏడు జోన్‌లను కోరింది. దీని ద్వారా ఖర్చుల భారాన్ని అదుపులోకి తీసుకురావటానికి బోర్డు ప్రయత్నిస్తోంది.

బోర్డు ఛైర్మన్ ఏమన్నారంటే..
త్రైమాసిక సమీక్షా సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్ వికె త్రిపాఠి కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే వరకు.. మొత్తం ఏడు జోన్‌లలో, గత ఏడాది ఇదే కాలంలో రైల్వేల సగటు వృద్ధి 26 శాతం కంటే బాగా పెరిగింది. రైల్వే లెక్కల ప్రకారం 2022-23లో కార్యకలాపాల ఖర్చులకు సంబంధించి మొత్తం బడ్జెట్ అంచనా రూ.2.32 లక్షల కోట్లుగా ఉంది. ఖాతాలు ఇంకా ఆడిట్ చేయబడనందున సంబంధిత గణాంకాలు తాత్కాలికమైనవని తెలుస్తోంది.

తక్షణ చర్యలు అవసరం..
జోన్‌లు తమ వ్యయాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు ఈ సమావేశంలో ఆదేశించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జనరల్ మేనేజర్‌లను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తూర్పు రైల్వే (ER), దక్షిణ రైల్వే (SR), ఈశాన్య రైల్వే (NER), ఉత్తర రైల్వే (NR) వంటి జోన్‌లు కిలోమీటరు భత్యాన్ని నియంత్రించాలని ఇందులో సూచించినట్లు తెలుస్తోంది.

నైట్ డ్యూటీ అలవెన్స్..
సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR), ఈస్ట్-సెంట్రల్ రైల్వే (ECR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECOR) నైట్ డ్యూటీ అలవెన్స్‌పై తమ వ్యయాన్ని తగ్గించాలని రైల్వే బోర్డు ఛైర్మన్ వికె త్రిపాఠి కోరారు. రైలు నడుపుతున్న ఉద్యోగులకు ఈ భత్యాన్ని ఇస్తారు.


Click it and Unblock the Notifications