న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. అదను చూసి దెబ్బ కొట్టినట్టే కనిపిస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా అదనపు భారాన్ని మోపింది. ఇప్పటికే కళ్లు తిరిగేలా పెరిగిన నిత్యావసర సరుకులు పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమౌతోన్న సమయంలో మరోసారి బాదుడు మొదలు పెట్టింది. లక్షలాదిమంది రైలు ప్రయాణికులను కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యంగా చేసుకుంది.

స్టేషన్లలో యూజర్ ఫీజ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో రద్దీ నియంత్రణ పేరుతో స్టేషన్లలో ఇప్పటికే టికెట్ల రేట్లను పెంచిన రైల్వే అధికారులు- ఇప్పుడు టికెట్లపై అదనపు ఛార్జీని వసూలు చేయనున్నారు. రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొత్తగా లెవీ వ్యవస్థను రైల్వే బోర్డు ప్రవేశపెట్టబోతోంది. స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) లేదా యూజర్ ఫీ పేరుతో టికెట్ల రేట్లను ఎకాఎకిన పెంచేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

రూ.50 వరకు
యూజర్ ఫీజు పేరుతో ఒక్కో టికెట్‌పై 10 నుంచి 50 రూపాయల వరకు అదనపు మొత్తాన్ని వసూలు చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. అన్ రిజర్వుడ్ టికెట్లపై 10 రూపాయలు, సెకెండ్ క్లాస్ స్లీపర్‌పై 25 రూపాయలు, అన్ని రకాల ఏసీ కోచ్‌లల్లో ప్రయాణంపై 50 రూపాయలను అదనంగా వసూలు చేయనుంది. నిర్దేశించిన టికెట్ ధర కంటే అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ రైళ్లను ఈ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చింది.

రీ డెవలప్ చేసిన.. చేయదలిచిన స్టేషన్లలో..
తొలిదశలో ఈ తరహా యూజర్ ఫీజు టికెట్లను కొన్ని స్టేషన్లకు మాత్రమే పరిమతం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. అభివృద్ధి చేసిన లేక సమీప భవిష్యత్తులో అభివృద్ధి చేయదలిచిన రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థ అమల్లోకి తీసుకుని వస్తుంది. క్రమంగా దీన్ని విస్తరించే అవకాశాలను పరిశీలిస్తుంది. అభివృద్ధి చేసిన స్టేషన్లలోనూ ఈ యూజర్ ఫీజులను వసూలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పుడు రీ డెవలప్ చేస్తారో తెలియని స్టేషన్లలోనూ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూజర్ ఫీజు వసూళ్లు ఎలా..
ఈ యూజర్ ఫీజులను టికెట్ బుక్ చేసే సమయంలోనే ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ తరగతిని ఆధారంగా చేసుకుని- నిర్దేశిత ధరకు అదనంగా ఈ అదనపు మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్నా లేక ఆఫ్‌లైన్ రూపంలో రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉండే కౌంటర్లలో తీసుకునే టికెట్ల మీదా ఇదే రకమైన వర్తింపు ఉంటుంది. మూడు కేటగిరీల్లో ఈ అదనపు వసూళ్లు ఉంటాయి.

కనిష్ఠంగా రూ.10.. గరిష్ఠంగా 50
అన్ రిజర్వుడ్ టికెట్‌పై 10 రూపాయలు, సెకెండ్ క్లాస్ స్లీపర్‌పై 25 రూపాయలు, ఏసీ అన్ని టయర్ కోచ్‌లపైనా 50 రూపాయలను అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అదే తరహా విధానాన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేయడం ద్వారా అదనంగా నిధులు సమకూరుతాయని, వాటిని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications