RailOne App: రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా అన్ని రకాల సేవలను ఒకే యాప్ లోకి తీసుకువచ్చింది. రైల్‌వన్ (Rail One) పేరుతో ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు అన్ని సౌకర్యాలను ఒకే చోట పొందవచ్చు. ఈ సూపర్ యాప్ ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ యాప్ రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
గతంలో రైలులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ యాప్ ఉపయోగించేవారు. అలాగే అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల కోసం UTS యాప్ లోకి వెళ్లేవారు. ఇక రైలులో ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు ట్రైన్ స్టేటస్ కోసం ఇతర రకాల యాప్ ల మీద ఆధారపడేవారు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సేవలను రైల్‌వన్ ద్వారా ప్రయాణికులు పొందవచ్చు.

కొన్ని నెలలుగా స్వరైల్ పేరిట యాప్ ని పరీక్షించిన రైల్వేశాఖ తాజాగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే భవిష్యత్తులో ఈ సేవలే కాకుండా మరిన్ని సేవలను ఈ యాప్ ద్వారా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) వార్షికోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి దీనిని లాంచ్ చేశారు. ఈ యాప్ ని CRIS డెవలప్ చేసింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్ తెలుసుకోవడం చాలా ఈజీ.. అలాగే ప్లాట్‌ఫామ్ టికెట్లు బుక్ చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లైవ్ స్టేటస్, కోచ్ పొజిషన్ తెలుసుకోవడం, ఫుడ్ ఆర్డర్, ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్, రైల్వే వాలెట్ వంటి అన్ని రకాల సేవలు ఈ యాప్ గొడుగు కిందకు రానున్నాయి.
ప్రస్తుతం ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ యాప్ లో మరో తేలికైన విషయం ఏంటంటే.. సింగిల్ సైన్-ఇన్ సౌకర్యం. అంటే మీరు మీ పాత లేక కొత్త రైల్ కనెక్ట్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఒకసారి లాగిన్ అయితే మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.రైల్ కనెక్ట్ లేదా యూటీఎస్ అకౌంట్లు కలిగి ఉన్న వినియోగదారులు అదే లాగిన్ వివరాలు ఉపయోగించి రైల్ వన్ యాప్ లో మీ ఖాతాకు లాగిన్ అవ్వొచ్చు.
IRCTC రైల్ కనెక్ట్ యాప్ ఇప్పటికే 100 మిలియన్ల మందికి పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రయాణికుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ గా భారతీయ రైల్వే యాప్ నిలిచింది.ఎక్కువ శాతం మంది ఈ యాప్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకుంటారు. అయితే ఈ యాప్ ఈ మధ్య కాలంలో పలు అంతరాయాలు ఎదుర్కుంది. వినియోగదారులు ఫిర్యాదులతో హోరెత్తించారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవతున్నాయని యాప్ వినియోగదారులు కంప్లయిట్లు చేస్తున్నారు.
ఇక ఈ యాప్ ద్వారా ఆర్-వాలెట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కేవలం పిన్ లేదా బయోమెట్రిక్ ఉపయోగించి యూజర్లు తమ ఖాతాలను మేనేజ్ చేసుకోవచ్చు. వెయిట్‌లిస్ట్ చార్ట్‌ను ఇకపై 8 గంటల ముందే రెడీ అవుతుంది. అయితే ఇంతకు ముందు వెయిట్‌లిస్ట్ చార్ట్ 4 గంటలకు ముందు మాత్రమే ఉండేది. ఇకపై 400 గంటలకు ముందు రైళ్లకు, అలాగే 2100 గంటలకు ముందు చార్టులు రెడీ అవుతాయి.
జూలై 1 2025 నుంచి ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లు బుక్కింగ్ సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ వెరిఫైడ్ వ్యక్తులు మాత్రమే ఈ సేవలను పొందుతారు.. అలాగే ఈ జూలై నెల చివరి నాటికి ఆధార్ కార్డు ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని భారత రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం కోసం నిమిషానికి లక్ష 50వేల టిక్కెట్లను ప్రాసెస్ చేసే కెపాసిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications