IIT Placements: ఐఐటీ బాంబేలో 36 శాతం విద్యార్థులకు ఇంకా ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఐఐఎంలలో చదివినా జాబ్ గ్యారెంటీ లేకపోవటం చాలా యువతను నిరాశకు గురిచేస్తోంది.
ప్రస్తుతం IIT బాంబేలో ప్లేస్‌మెంట్‌లు జరుగుతున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయి. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న 36 శాతం మంది విద్యార్థులకు ఇంకా జాబ్ ఆఫర్లు అందలేదని సమాచారం. ఐఐటీ బాంబేలో నమోదైన 2000 మంది విద్యార్థుల్లో దాదాపు 712 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ రాలేదు. గ్లోబల్ ఐఐటీ పూర్వ విద్యార్థి&సపోర్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరజ్ సింగ్ ఈ డేటాను పంచుకున్నారు. IIT బాంబే ప్రస్తుతం ప్లేస్‌మెంట్ ప్రక్రియ మే 2024 వరకు కొనసాగుతుంది.

ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ ఎక్కువగా కోరుకునే కోర్సులు. ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్‌లోని విద్యార్థులు 100% ప్లేస్‌మెంట్ పొందుతారు. అయితే ఈ బ్రాంచ్‌లోని విద్యార్థులకు ప్లేస్‌మెంట్ రాకపోవడం ఇదే తొలిసారి. గతేడాది 32.8 శాతం మంది ఐఐటీ బాంబే విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోయారు. ప్లేస్‌మెంట్‌లు పొందలేని విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 2.8 శాతం పెరిగింది. మెుత్తంగా 2,209 మంది విద్యార్థుల్లో 1,485 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ పొందారు.
ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల కంపెనీలకు ప్లేస్‌మెంట్‌లు రావడం కష్టమైందని ఐఐటీ-బాంబే ప్లేస్‌మెంట్ సెల్ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ, బీజేపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు కూడా నిరుద్యోగులను కలిగి ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఐఐటీల వంటి చోట్ల ప్లేస్‌మెంట్లు జరగనప్పుడు ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సూచించారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ పరిస్థితి ఇలా ఉంటే.. బీజేపీ దేశం మొత్తానికి ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలని రాహుల్ కోరారు. ప్రధాని మోదీకి ఉపాధి కల్పించాలనే విధానం, ఉద్దేశం లేదని, భావోద్వేగ ప్రశ్నల్లో ఇరుక్కుని దేశంలోని యువతను మోసం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ కూడా అలాంటి విమర్శలే చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications