Rahul Gandhi: అదానీది 'ప్రత్యక్ష దొంగతనం'.. బొగ్గు ధరలపై భగ్గుమన్న రాహుల్ గాంధీ..
Rahul Gandhi: గ్యాప్ దొరికినప్పుడల్లా కాంగ్రెన్ నేత రాహుల్ గాంధీ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఏకంగా మోదీ-అదానీ సంబంధాలపై లోక్ సభలోనే ప్రశ్నించి ఎండగట్టారు.
తాజాగా దేశంలో బొగ్గు ధరల వ్యవహారంపై రాహుల్ స్పందించారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అధిక డిమాండ్ తీర్చేందుకు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను చాలా సంస్థలు తిరిగి వినియోగంలోకి తెచ్చాయి. దీంతో విదేశాల నుంచి అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్‌వాయిస్ చేసి ప్రజల సొమ్మును రూ.12,000 కోట్లను లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించి ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవలి నివేదికను రాహుల్ ఉదహరించారు. అదానీ విషయంలో విచారణ ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోదీ తన విశ్వసనీయతను కాపాడుకోవాలన్నారు. ఈ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కంటే చాలా ఎక్కువ ధరలకు బిలియన్ డాలర్ల బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపణలు ప్రస్తుతం దావానలంగా వ్యాపిస్తున్నాయి. ఓవర్ ఇన్‌వాయిస్ చేసి అదానీ రూ.12,000 కోట్లను ప్రజల జేబుల నుంచి కాజేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇండోనేషియాలో బొగ్గు కొని దానిని ఇండియాకు తీసుకొస్తుంటే ధర రెండింతలౌతోందని నివేదికలను ఉదహరిస్తూ వెల్లడించారు. ఇలా ఓవర్ ఇన్ వాయిసింగ్ వల్ల దేశంలో విద్యుత్ ధరలపై ప్రభావం పడి అంతిమంగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అదానీకి ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉందని, అతని వెనుక ఎవరు ఉన్నారనే విషయం దేశంలోని ప్రజలందరికీ తెలుసరి రాహుల్ వ్యాఖ్యానించారు. ఈసారి దొంగతనం ప్రజల జేబుల నుంచి జరుగుతోందని.. ప్రజలు స్విచ్ నొక్కితే డబ్బు అదానీ జేబులో పడుతోందంటూ విమర్శించారు. అయితే ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల విషయంలో దర్యాప్తు ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications