PM Modi: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారతీయ రైల్వేలను 'అసమర్థత'గా నిరూపించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని లాభసాటిగా పనికి రానిదిగా చూపించి తన 'స్నేహితులకు' అమ్మే ప్రయత్నం చేస్తోందని రాహుల్ ఆరోపించారు . ఫలితంగా సామాన్యుల రవాణాను కాపాడేందుకు మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. మోదీ హయాంలో ప్రజలు రైల్వే కంపార్ట్మెంట్ నేలపై, మరుగుదొడ్లలో కూర్చుని ప్రయాణిస్తున్న వీడియోలను రాహుల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. టిక్కెట్లు కన్ఫామ్ చేసినా ప్రజలు తమ సీట్లలో హాయిగా కూర్చోలేకపోతున్నారని రాహుల్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అస్సాం, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, జమ్మూ కశ్మీర్, కేరళ, మహారాష్ట్రల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ముమ్మురంగా ప్రచారం కొనసాగిస్తుండగా రాహుల్ తాజా కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మోదీ పరిపాలనలో సామాన్యులకు రైలు ప్రయాణం శిక్షగా మారిందని అన్నారు. బీజేపీ పబ్లిక్ కోచ్‌లను తగ్గించి 'ఎలైట్ రైళ్ల'ను మాత్రమే ప్రమోట్ చేస్తూ వేధిస్తోందని తన పోస్టులో పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం తన విధానాలతో రైల్వే రంగాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా తన స్నేహితులకు వాటిని కట్టబెట్టాలని చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల రవాణాను కాపాడాలంటే రైల్వే రంగాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తరిమికొట్టాలంటూ దేశవ్యాప్తంగా ఓటర్లకు పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications