ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఛైర్మన్ పదవి నుండి రాహుల్ బజాజ్ వైదొలగబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30, 2021 నుండి అమలులోకి వస్తుంది. రాహుల్ బజాజ్ తన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తరువాత ఐదేళ్లపాటు కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ గా ఉంటారని ప్రకటించారు.

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు కంపెనీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్
రాహుల్ బజాజ్ రాజీనామాతో మే 1 నుండి నీరజ్ బజాజ్ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) తో తన రెగ్యులేటరీ ఫైలింగ్లో, బజాజ్ ఆటో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాహుల్ బజాజ్ 1972 నుండి ఐదు దశాబ్దాలుగా పనిచేస్తున్నారని స్పష్టం చేసింది. ఆయన వయస్సు దృష్ట్యా ఏప్రిల్ 30 నుండి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు కంపెనీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది.గత ఐదు దశాబ్దాలుగా కంపెనీ మరియు గ్రూప్ విజయానికి రాహుల్ బజాజ్ భారీ కృషి చేశారు.

5 సంవత్సరాల కాలానికి కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ గా కొనసాగనున్న రాహుల్ బజాజ్
ఆయన అద్భుతమైన అనుభవాన్ని, సంస్థ యొక్క అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడానికి ,మార్గదర్శకుడిగా అతని అనుభవం, జ్ఞానాన్ని ఉపయోగించి సంస్థ ప్రయోజనాలను కొనసాగించడానికి,ఈ రోజు జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు,ఆయనను 5 సంవత్సరాల కాలానికి కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ గా నియమించడానికి కమిటీ ఆమోదం తెలిపిందని, మే 1 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.ఇదే సమయంలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీరజ్ బజాజ్ మే ఒకటి నుండి చార్జ్ తీసుకుంటారని పేర్కొన్నారు.

బజాజ్ ఆటో క్యూ 4 ఫలితాలు , నికరలాభం 2% పెరుగుదల
బజాజ్ ఆటోకి సంబంధించి పెద్ద ప్రకటనతో పాటుగా బజాజ్ ఆటో కూడా క్యూ 4 ఆర్థిక త్రైమాసికం 2021 కోసం తన ఆదాయాన్ని గురువారం విడుదల చేసింది. కంపెనీ నికర లాభం 2% పెరిగి 1,332 కోట్ల రూపాయలకు చేరుకుంది. క్యూ 4 ఎఫ్‌వై 20 లో బజాజ్ నికర లాభం రూ .1,310 కోట్లు. ప్రస్తుతం దాని ఆదాయం సంవత్సరానికి 26% పెరిగి రూ .8,596 కోట్లకు చేరుకుంది. వాటాదారులకు ఒక్కో షేర్ కు రూ.140 డివిడెండ్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications