రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్కరణ విధానాలను ప్రశంసించారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆరోపించారు. అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ ఎన్‌పీఏల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
ఒకప్పుడు మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు కురిపించిన రఘురామ్ రాజన్.. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు జరిగాయని 'ది ప్రింట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అరుణ్ జైట్లీతో తాను జరిపిన సంభాషణను వివరిస్తూ బ్యాడ్ లోన్ పరిస్థితి గురించి నేను ఆయనకు చెప్పినప్పుడు దానిని 'క్లీన్ అప్' చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ సరే గో ఎహెడ్ అని అన్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి కారణంగా బ్యాంకుల ఎన్పీఏ ఎలా పెరిగిందో రఘురామ్ రాజన్ చెప్పారు. రైట్‌ఆఫ్‌ల ద్వారా బ్యాంకులు కోలుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకరించిందని కొనియాడారు.

2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించారు. దీని తర్వాత తాను బ్యాంకుల మొండి బకాయిలను పరిష్కరించేందుకు ప్రయత్నించానని, 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ చాలా సాయం చేశారని చెప్పారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పాటు భారతదేశంలో అవినీతి కూడా పెద్ద సమస్య అని రాజన్ అన్నారు. ఈ కారణాల వల్ల చాలా ప్రాజెక్టులకు ఆమోదం పొందడంలో జాప్యం జరిగింది. దీనితో పాటు పర్యావరణ అనుమతుల వల్ల కూడా చాలా ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఈ విషయాలన్నీ బ్యాంకు లోన్ వ్యవస్థపై ప్రభావం చూపాయని ఇంకా ప్రాజెక్ట్ సకాలంలో ప్రారంభం కానందున బ్యాంకు డబ్బు నిలిచిపోయిందని అలాగే చెడ్డ రుణాలు పెరిగాయని అతను చెప్పాడు.
మారటోరియం విధానంలోని లోపాలను వివరిస్తూ, 2008 ఆర్థిక సంక్షోభానికి ముందు బ్యాంకులు ఉచితంగా డబ్బు పంపిణీ చేసేవని మాజీ ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయకుండా ఈ రుణాలు ఇచ్చిన తరువాత ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మార్చింది దింతో ప్రభుత్వ విధానాలతో అది మరింత అధ్వాన్నంగా మారింది. నాకంటే ముందు ఉన్న గవర్నర్ బ్యాంకుల మొండి బకాయిలపై మారటోరియం విధించారని రఘురాం రాజన్ అన్నారు.
నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను మారటోరియం విధానానికి స్వస్తి పలికాను అన్నారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ.. బ్యాంకుల ఎన్ పీఏను తగ్గించడంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంతగానో సహకరించారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. బ్యాంకులను కాపాడేందుకు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవని చెప్పారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications