ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి ప్రయివేటీకరించకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఒకటి రెండింటిని ప్రయివేటీకరించి చూడాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తమల్ బందోపాధ్యాయ రచించిన 'పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ' త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలో మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, వైవీ రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, సీ రంగరాజన్ హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్పీఏ సమస్యకు కారణమిదే... రఘురాం రాజన్
కంపెనీలు అవసరానికి మించిపెట్టిన పెట్టుబడులు, ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంలో బ్యాంకులు ప్రదర్శించిన అత్యుత్సాహం, సత్వర స్పందన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఎన్పీఏ సమస్య పెరగడానికి మూల కారణాలని రఘురాం రాజన్ అన్నారు. దేశీయ బ్యాంకుల ఎన్పీఏలు ఏ దేశంలోను లేనంత భారీస్థాయికి పెరిగాయన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల నిరర్థక ఆస్తులతో ముప్పు పొంచి ఉందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి కాకపోయినా ప్రయోగాత్మకంగా ఒకటి రెండింటిని ప్రయివేటీకరించి చూడాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యమే పెద్దసమస్య అన్నారు.

విదేశీ సంస్థల బ్యాంకుల ఆధిపత్యం పెరుగుతుంది
ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో సమస్య పరిష్కారం కాదని, ప్రధాన సమస్య పాలనాపరమైన లోపాలు అని వైవీ రెడ్డి అన్నారు. ప్రభుత్వం క్రమంగా తప్పకుండా మూలధనాన్ని సమకూర్చుతున్నప్పటికీ, ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మార్కెట్ వాటాను కోల్పోతున్నాయన్నారు. ఇలాగే ఉంటే కొంతకాలానికి బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థలు అధిక వాటాదారులుగా ఉన్న ప్రయివేటు బ్యాంకుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బ్యాంకుల మూలధనం కోసం ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తోందన్నారు.

ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంకుగా..
ప్రభుత్వ అజమాయిషీలో కొన్ని బ్యాంకులు ఉంటే సరిపోతుందని, ఎన్ని బ్యాంకులు ఉండాలనే అంశం ప్రభుత్వం ఆర్థిక సత్తా పైన ఆధారపడి ఉంటుందని డాక్టర్ రంగరాజన్ అన్నారు. ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంకుగా ఉండాలని, ఇది కాక మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉంటే చాలునని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications