Multibagger Stock: గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ల పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవటం మనందరం గమనిస్తూనే ఉన్నాం. దీని వెనుక ద్రవ్యోల్బణం, వివిధ కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. ఇలాంటి హై ఓలటైల్ మార్కెట్లలోనూ కొన్ని మంచి స్టాక్స్ వృద్ధి బాటలో నడుతూ తమ ఇన్వస్టర్లకు ఊహించని లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. ప్రస్తుతం రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్(Raghav Productivity Enhancers) స్టాక్ కూడా ఈ కోవకు చెందినదే. గడచిన ఆరు సంవత్సరాల కారంలో స్టాక్ ఏకంగా 2000 శాతం లాభపడింది.

26 దేశాలకు ఎగుమతులు..
రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ ఉక్కు రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న సంస్థ. వివిధ రకాల క్వార్ట్జ్ ఆధారిత ర్యామింగ్ మాస్, క్వార్ట్జ్ పౌడర్, టుండిష్ బోర్డులు ప్రధానంగా తయారు చేస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను 'రాఘవ్' బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది. ఈ కంపెనీ తన ఉత్పత్తులను 26 విదేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ తయారీ కేంద్రం రాజస్థాన్‌లోని నెవాలో ఉంది.

రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడులు..
రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ మొత్తం షేర్లలో ప్రమోటర్లకు 69.61 శాతం వాటాను కలిగి ఉన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు కంపెనీలో 30.36 శాతం వాటా ఉంది. భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా ఈ కంపెనీలో రూ.30.90 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 2021లో పెద్ద ఈక్విటీ ఇన్వెస్టర్లైన ధమాని, ఉత్పల్ సేథ్, ముకుల్ అగర్వాల్, ఎల్‌ఎన్ బంగూర్, ప్రతీక్ ఖేలా కూడా కంపెనీలో పెట్టుబడి పెట్టారు.

లాభాలు ఇలా..
రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ 2016లో రూ.28 కోట్ల మార్కెట్ క్యాప్‌తో BSEలో లిస్ట్ అయింది. ఆరేళ్ల క్రితం ఈ మైక్రో క్యాప్ స్టాక్ ధర రూ.28గా ఉండగా.. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు స్టాక్ విలువ రూ.609 వద్ద ఉంది. ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్ లో రూ.28 ధర వద్ద లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.21.75 లక్షలుగా ఉండేది. స్టాక్ గత 52 వారాల్లో షేరు గరిష్ఠ ధర రూ.1,008.50 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.434 వద్ద ఉంది. కంపెనీ నికర లాభం 26 శాతం పెరిగి రూ.5.15 కోట్లకు చేరుకుంది.

భారీగా పెరుగుతున్న లాభాలు..
సిలికా ర్యామింగ్ మాస్, ఫౌండ్రీ అండ్ కాస్టింగ్ ఆధారిత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం బ్రిటన్‌కు చెందిన క్యాపిటల్ రిఫ్రాక్టరీస్ లిమిటెడ్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రాఘవ్ ఉత్పాదకతను పెంచేవారికి కొత్త మార్కెట్లను కూడా తెరుస్తుంది. దీనితో పాటు రాజస్థాన్‌లోని తయారీ కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కంపెనీ గత 5 సంవత్సరాల్లో 48 శాతం కాంపౌండింగ్ రేటుతో నికర లాభాన్ని పెంచుతోంది. కంపెనీకి చెప్పుకోవడానికి ఎటువంటి లోన్స్ లేకపోవడం కూడా గమనార్హం.


Click it and Unblock the Notifications