మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు..కేంద్రంపై ధ్వజమెత్తిన రాఘవ్ చద్దా..

బ్యాంకులు పేదోడి బతుకుతో ఆటలాడుతున్నాయి. మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయడం లేదని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ వేదికగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కరెంట్ బ్యాంకింగ్ వ్యవస్థపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24, 2024-25).. దేశంలోని బ్యాంకులు కనీస ఖాతా నిల్వను ఉంచని ఖాతాదారుల నుంచి రూ.19 వేల కోట్లు వసూలు చేసాయని తెలిపారు. ఆ విధంగా శిక్షలు విధించడం పేద ప్రజలపై ప్రభావం చూపుతుందని.. పొదుపును నిరుత్సాహపరుస్తుందని Raghav Chadha అన్నారు.

చాలా మంది పేదవాళ్లు కొన్ని వేల రూపాయల పొదుపును నెలల పాటు క్రమంగా జమ చేస్తారు. కానీ ఒక చిన్న అత్యవసర పరిస్థితిలో, ఆ డిపాజిట్‌లోంచి కొన్ని రూపాయలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంకులు అదే ఖాతాపై ఫీజులు తీసుకుంటూ వారి పొదుపును తక్కువ చేస్తాయి. ఉదాహరణగా ఒక ఖాతాదారుడు ఆరు వేల రూపాయలు పొదుపు చేసి, తక్షణ అవసరం కోసం రెండు వేల రూపాయలు వాడుకున్నా, బ్యాంక్ ఆ ఖాతాపై ఫీజు విధించడంతో చివరికి అతని ఖాతాలోని మొత్తం తగ్గిపోతుందని చద్దా తెలిపారు.

Raghav Chadha minimum balance charges bank fees India end bank penalties savings account fees RBI rules banking charges Indian banks customer-friendly banking minimum balance penalty abolish bank fee reforms Indian savings accounts financial news India banking news Rs 19000 crore bank fees penalty RBI

మొత్తం 600 రూపాయల ఫీజు, ఆ పేదవాడికి ఎంతో ముఖ్యమైనది. ఇది అతని పొదుపును పూర్తిగా అర్థం చేసుకోకుండా దెబ్బతీస్తుందని చద్దా నొక్కి చెప్పారు. పేద ప్రజల జీవితాలను కష్టతరం చేస్తూ, బ్యాంకులు ఫీజులు వసూలు చేయడం, వారి పొదుపును శిక్షించడం అనేది ఆర్థిక సమ్మిళితకు అనుగుణంగా లేదని ఆయన తెలిపారు. ఈ విధమైన జరిమానాలను తొలగించడం ద్వారా పేదలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయవచ్చని, పొదుపు అలవాటును ప్రోత్సహించవచ్చని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకింగ్ సమస్యలను కూడా చద్దా హైలైట్ చేశారు. చిన్న ఖాతాదారులు 1,000 నుంచి 3 వేల రూపాయల మధ్య నిల్వ ఉంచాల్సి వస్తుందని.. ఆ పై బ్యాంకులు 50 నుంచి 600 రూపాయల వరకు రుసుములు వసూలు చేస్తారని.. అందులో 18 శాతం GST కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. పేదలు మరింత పేదవారిగా మారుతున్నారు. రైతుల రుణాల మాదిరే, కనీస ఖాతా నిల్వపై విధించే జరిమానాలను కూడా మాఫీ చేయాలని ఆయన స్పష్టంగా అన్నారు.

ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే.. రమేష్ అనే పేద వ్యక్తి 6 నెలల పాటు బ్యాంకులో పొదుపు చేస్తాడని తీసుకుందాం. రమేష్ ప్రతి నెల రూ. 1,000 బ్యాంకులో జమ చేస్తాడు. 6 నెలల తర్వాత అతని ఖాతాలో మొత్తం రూ.6,000 ఉంటుంది. అకస్మాత్తుగా, అతని కుటుంబంలో ఎవరూ అనారోగ్యానికి గురవుతారు. రమేష్ తన ఖాతా నుండి రూ.2,000 వాడుకుంటాడు. బ్యాంక్ policies ప్రకారం అతను ఇప్పుడు Minimum Balance మెయింటెన్ చేయలేకపోతాడు. ఫలితంగా, బ్యాంక్ అతని ఖాతా నుండి రూ. 100 నుంచి రూ. 600 వరకు ఫీజు వసూలు చేస్తుంది. అదనంగా 18% GST కూడా విధించబడుతుంది.ఇప్పుడు రమేష్ రూ. 6,000 రూపాయల పొదుపులోంచి ఫీజులు, GST కలిపి మొత్తం రూ. 5,400 రూ. 5,500 మాత్రమే మిగులుతుంది.

మన దేశంలోని పేదలను ఆర్థికంగా భాగస్వాములుగా చేసుకోవాలంటే, MAB ఫీజులు, బ్యాంకు జరిమానాలను రద్దు చేయండి. పొదుపును ప్రోత్సహించాల్సిన సమయం ఇది, శిక్షించాల్సినది కాదని చద్దా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+