దాయాది దేశం పాకిస్తాన్, పొరుగుదేశం చైనా నుంచి మన దేశానికి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రు దేశాల నుంచి వచ్చే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాలను మరింతగా పటిష్టం చేసుకునే పరిస్థితి. ఇందులో భాగంగానే భారత్ మరో కీలక రక్షణ ఒప్పందానికి రెడీ అవుతోంది.
భారత వైమానిక దళ బలాన్ని మరింత పెంచే లక్ష్యంలో భాగంగా దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రాఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన ముందుకు సాగుతున్నట్లు రక్షణ వర్గాల సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి మూడవ వారంలో న్యూఢిల్లీకి రానున్న నేపథ్యంలో.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఈ మెగా డీల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భారత్‌లోనే తయారు చేయాలన్న ప్రతిపాదన: ఈ ఒప్పందానికి తుది ఆమోదం లభిస్తే.. భారత ఆయుధ సమీకరణ చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ డీల్‌గా ఇది నిలవనుంది. ప్రత్యేకంగా ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. దాదాపు 100 వరకు రాఫేల్ యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ విమానాల తయారీ జరగనుండగా.. అత్యాధునిక ఫైటర్ జెట్ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయనున్నారు. దీని ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది.
88 సింగిల్-సీటర్ జెట్లు, 26 ట్విన్-సీటర్ జెట్లు: రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం..ఈ ప్రాజెక్టులో 88 సింగిల్-సీటర్ జెట్లు, 26 ట్విన్-సీటర్ జెట్లు ఉంటాయి. డసాల్ట్ ఏవియేషన్‌తో పాటు భారత ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో దేశీయంగా పెద్ద ఎత్తున తయారీ చేపట్టనున్నారు. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, భారత వైమానిక దళం వద్ద మొత్తం 150 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి. ఇప్పటికే సేవలో ఉన్న 36 రాఫెల్స్‌కు ఇవి అదనంగా చేరతాయి.
గత నెలలోనే 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ బోర్డు (Defence Acquisition Board) ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఈ డీల్ అమలైతే, 4.5-తరాలకు పైగా ఉన్న అత్యాధునిక బహుళ-పాత్ర యుద్ధ విమానాల అవసరాన్ని IAF తీర్చుకోగలుగుతుందని అంచనా.
స్క్వాడ్రన్ బలాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర : అంతేకాకుండా, వైమానిక దళంలోని స్క్వాడ్రన్ బలాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం భారత వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్ల అనుమతితో పోలిస్తే కేవలం 30 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాఫెల్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లపై దృష్టి సారిస్తోంది.
36 Rafale యుద్ధ విమానాలు సేవలు: ఇప్పటికే భారత వైమానిక దళానికి 36 Rafale యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో సీ (C) వేరియంట్‌కు చెందిన చివరి విమానాన్ని భారత్ 2024 డిసెంబరులో స్వీకరించింది. ఈ విమానాలు అంబాలాలోని నంబర్ 17 స్క్వాడ్రన్, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా ఎయిర్ బేస్‌లో ఉన్న నంబర్ 101 'ఫాల్కన్స్' స్క్వాడ్రన్‌లో మోహరించబడ్డాయి.
నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు: వైమానిక దళంతో పాటు నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 26 నావల్ రాఫేల్ (M వేరియంట్) యుద్ధ విమానాల కొనుగోలుకు సుమారు రూ. 63 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (MRO) ఒప్పందం కూడా ఉంది. అదనంగా నాలుగు ట్విన్ సీట్ ట్రైనర్ విమానాలను కూడా కొనుగోలు చేశారు. ఈ ఎం వేరియంట్ రాఫేల్ విమానాలను INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి యుద్ధ నౌకలపై మోహరించనున్నారు.
భారత సైనిక ఆపరేషన్లలో కీలక పాత్ర: రాఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే భారత సైనిక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం రాఫేల్ విమానాలను వినియోగించినట్లు సమాచారం. ఆ ఆపరేషన్‌లో స్కాల్ప్ ఎయిర్-లాంచ్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. రాఫేల్ విమానాలు మెటియోర్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు, హామర్ స్ట్రైక్ వెపన్లు, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, అత్యాధునిక రాడార్, టార్గెటింగ్ సిస్టమ్స్ వంటి అత్యున్నత సాంకేతికతతో సజ్జంగా ఉన్నాయి.
భారత్‌లో తయారీ భాగంగా హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలో రాఫేల్ విమానాలకు సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఉత్పత్తి చేయనున్నారు. అయితే తుది దశ అసెంబ్లింగ్ మాత్రం ఫ్రాన్స్‌లోని మెరిజ్నాక్‌లో ఉన్న డసాల్ట్ ఏవియేషన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతుంది.
ప్రస్తుత ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, సరిహద్దు ఉద్రిక్తతలు, వైమానిక దళ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ రాఫెల్ ఒప్పందం భారత వైమానిక దళానికి అత్యంత కీలకమని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. భారత వైమానిక దళం (IAF) తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ కొనుగోలు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ తన భారత్ పర్యటనను జనవరిలోనే ధృవీకరించారు. గ్లోబల్ సౌత్‌లో మొదటిసారిగా నిర్వహించనున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. అధికారిక సమాచారం ప్రకారం.. మాక్రాన్ ఫిబ్రవరి 18న న్యూఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications