Penny Stock: ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన లిక్కర్ స్టాక్.. మరింత పెరిగే అవకాశం..! మీరూ ఓ లుక్కేయండి..

Multibagger Stock: సంపాదించటానికి సహనం చాలా ముఖ్యం అనే విషయాన్ని స్టాక్ మార్కెట్ బాగా నేర్పిస్తుంది. దానిని సరిగా వినియోగించుకునే వారిని మాత్రమే ధనవంతులను చేస్తుంది. మార్కెట్‌లో 10 ఏళ్లు ఉండలేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేనే నానుడిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మల్టీబ్యాగర్ రాబడులను అందించే స్టాక్స్ మార్కెట్లో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పట్టుకుంటే ధనవంతులు కావటం అంత కష్టమేమీ కాదు.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రాడికో ఖైతాన్ స్టాక్ గురించే. రాడికో ఖైతాన్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద, పురాతన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ తయారీ దారు. కంపెనీ 1943లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. స్పిరిట్స్ తయారీలో కంపెనీకి 75 సంవత్సరాల అనుభవం ఉంది. 8PM విస్కీ, మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, కాంటెస్సా XXX రమ్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీతో సహా 15 బ్రాండ్లను కలిగి ఉంది. కంపెనీ బలమైన R&Dతో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. బలమైన బ్రాండ్ పోర్ట్‌ఫోలియోతో కంపెనీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలువైన కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.

 అమ్మకాల తుఫాను ఉన్నప్పటికీ పైకి ఎదిగి..

అమ్మకాల తుఫాను ఉన్నప్పటికీ పైకి ఎదిగి..

గత సంవత్సరంలో అమ్మకాల తుఫాను ఉన్నప్పటికీ.. ఈ బ్రూవరీ స్టాక్ మాత్రం ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. 19 ఏళ్ల క్రితం ఈ స్టాక్ ధర దాదాపు రూ.7.60 వద్ద ట్రేడ్ అవుతూ పెన్నీ స్టాక్ గా ఉంది. కానీ ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్లో రూ. 916.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కాలంలో ఇన్వెస్టర్ల డబ్బును 120 రెట్లు పెంచేసింది.

రాడికో ఖైతాన్ షేర్ ధర హిస్టరీ..

రాడికో ఖైతాన్ షేర్ ధర హిస్టరీ..

గత ఏడాదిలో స్టాక్ ధర రూ.855 నుంచి రూ.919కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 8% వృద్ధిని నమోదు చేసింది. గత 5 సంవత్సరాల్లో స్టాక్ దాదాపు రూ.140 నుం రూ.919 స్థాయిలకు పెరిగింది. ఈ కాలంలో 560 శాతం పెరిగింది. అదేవిధంగా గత 19 సంవత్సరాల్లో స్టాక్ దాదాపు రూ.7.60 నుంచి రూ.919కి పెరిగింది. దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు దాదాపు 11,990 శాతం రాబడిని అందించి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.

 పెట్టుబడిపై రాబడి..

పెట్టుబడిపై రాబడి..

ఒక ఇన్వెస్టర్ ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడిగా పెట్టినట్లయితే.. దాని విలువ ప్రస్తుతం దాదాపు రూ.1.08 లక్షలకు చేరుకునేది. అదే ఐదు సంవత్సరాల క్రితం లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం రూ.6.60 లక్షల రాబడి వచ్చేది. అదే స్టాక్ విలువ రూ.7.60 వద్ద పెట్టుబడి పెట్టి వేచి ఉన్న దీర్ధకాల పెట్టుబడిదారులు నేడు రూ.1.20 లక్షల రిటర్న్ అందుకునేవారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,294 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.537.10 వద్ద ఉంది. రానున్న కాలంలో స్టాక్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+