ముంబై: మనం రోజూ చూసే వోడ్కా (Vodka) ఏ రంగులో ఉంటుంది? అంటే దానికి సరైన సమాధానం లభించదు. దానికి ప్రత్యేకంగా ఎలాంటి రంగూ ఉండదు కాబట్టి. క్లియర్‌గా ఉంటుంది. కొన్ని కిక్ ఎక్కించే ఇంగ్రేడియంట్స్ మిక్స్ చేస్తారు. సాధారణంగా లభించే వోడ్కాలో నీటి శాతం అధికం. గోధుమలు, కార్న్, ఆలూ, చిరు ధాన్యాలతో తయారు చేస్తారు.
దీనికి భిన్నంగా కొత్త రకం వోడ్కా మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సెగ్మెంట్‌కు చెందిన ర్యాడికో ఖైతాన్ (Radico Khaitan).. కొత్తగా మార్కెట్‌లో ఫ్లేవర్డ్ అండ్ కలర్డ్ వోడ్కాను లాంచ్ చేసింది. పింక్ వోడ్కా (Pink Vodka) గా పేరు పెట్టింది. మేజిక్ మూమెంట్స్ రీమిక్స్ కేటగిరీలో దీన్ని ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం ఇది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాంలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పింక్ వోడ్కాను అందుబాటులోకి తీసుకొస్తామని ర్యాడికో ఖైతాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమర్ సిన్హా తెలిపారు. ఫ్లేవర్డ్ అండ్ కలర్డ్ వోడ్కాకు మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, అందుకే దీన్ని విడుదల చేశామని పేర్కొన్నారు.
వోడ్కా సెగ్మెంట్‌లో ఎదురవుతోన్న పోటీని తట్టుకోవడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోన్నామని, అందులో భాగంగానే ఈ ఫ్లేవర్డ్, కలర్డ్ వోడ్కాను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు అమర్ సిన్హా. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మున్ముందు మరిన్ని ఫ్లేవర్డ్ అల్కహాల్ బేవరేజెస్‌ను మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వోడ్కా అమ్మకాల్లో మేజిక్ మూమెంట్స్ ఏడో స్థానంలో ఉంటోంది. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ పింక్ వోడ్కా.. తమ గ్లోబల్ మార్కెట్‌ను మరింత పెంచుతుందని ర్యాడికో ఖైతాన్ అంచనా వేస్తోంది. మొత్తంగా వోడ్కా అమ్మకాల్లో 60 శాతం వాటా ఈ సంస్థదే. 2022- 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అయిదు మిలియన్ల కేసుల మేర వోడ్కా అమ్మకాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications