DMart Q2 Results: దేశవ్యాప్తంగా రాధాకిషన్ దమానీకి చెందిన రిటైల్ చైన్ డీమార్ట్ స్టోర్లను కలిగి ఉంది. తక్కువ ధరలను ఉత్పత్తులను అందిస్తూ ఇది మధ్య తరగతి వినియోగదారులకు చేరువైన సంగతి తెలిసిదే.
తాజాగా డీమార్ట్ స్టోర్లను నడుపుతున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో రెండవ త్రైమాసికంలో లాభాల క్షీణతను నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో పన్నుల తర్వాత కంపెనీ లాభం రూ.623.35 కోట్లుగా నిలిచింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.685.71 కోట్ల కంటే 9.09 శాతం తక్కువ.

అలాగే ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే లాభాలు తగ్గాయి. అయితే, కార్యకలాపాల ద్వారా ఆదాయంలో కంపెనీ చెప్పుకోదగ్గ సానుకూల ధోరణిని నమోదు చేసింది. అవెన్యూ సూపర్‌మార్ట్‌లు గత ఏడాది ఇదే కాలంలో రూ.10.638.33 కోట్ల ఆదాయంతో పోలిస్తే.. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో మెుత్తం ఆదాయం రూ.12.624.37 కోట్లుగా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన ఏకీకృత ఆదాయం 18.66 శాతం మేర పెరిగింది. ఆదాయం కూడా అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 6.39 శాతం పెరిగి రూ.11,865.44 కోట్లుగా ఉంది.
ముంబై కేంద్రంగా ఏర్పాటైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ యాజమాన్యంలోని.. DMart సూపర్ మార్కెట్‌లు ఆహారం, టాయిలెట్‌లు, బ్యూటీ ప్రొడక్ట్‌ల నుంచి కిచెన్‌వేర్, బెడ్ అండ్ బాత్ లినెన్, ఉపకరణాల వరకు అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీని రాధాకిషన్ దమానీ ఆయన కుటుంబం ప్రారంభించింది. మొదటి స్టోర్ 2002లో పొవాయ్‌లో ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌ల్లో ఏకంగా 324 ప్రాంతాల్లో స్టోర్లను డిమార్ట్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications