DMart Q2 Results: దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని పేరు రాధాకిషన్ దమానీ. వాస్తవానికి ఈయన బిగ్ బుల్ రాకేష్ జున్ జున్ వాలాకి గురువు కూడా. ప్రస్తుతం పెట్టుబడులతో పాటు దమానీ దేశంలో మధ్యతరగతి నుంచి ధనికుల వరకు ఫేమస్ అయిన డీమార్ట్ పేరుతో కిరాణా సరకులు విక్రయించే రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ వ్యాపారంలో ఈ స్టోర్లు అతిపెద్ద పోటీని ఇస్తున్నాయి. రిలయన్స్, టాటా, ఆదిత్యా బిర్లాలకు సంబంధించిన రిటైల్ స్టోర్లకు ఇది గట్టి పోటీని అందిస్తోంది.
దమానీ దేశంలోని డీమార్ట్ స్టోర్లను అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ కింద నిర్వహిస్తున్నాయి. తాజాగా కంపెనీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 5.77 శాతం పెరిగి రూ.659.58 కోట్లుగా ఉంది. గడచిన ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.623.56 కోట్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా 14.4 శాతం వృద్ధితో రూ.14,444.50 కోట్లకు చేరగా.. గడచిన ఏడాది ఇతే కాలంలో ఆదాయం రూ.12,624.37 కోట్లుగా నమోదైంది. Q2FY25లో వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (EBITDA) ముందు డీమార్ట్ ఆదాయాలు రూ.1,094 కోట్లుగా ఉన్నాయి.

ఆర్థిక సంవత్సరం మెుదటి అర్ధభాగంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ మెుత్తం ఆదాయం రూ.28,514 కోట్లుగా నమోదు కాగా.. గత ఏడాది ఇది ఇదే సమయంలో రూ.24,490 కోట్లుగా ఉంది. ఈబీఐటీడీఏ సైతం మెుదటి అర్ధభాగంలో రూ.2315 కోట్లుగా నమోదైంది. మార్చి సైతం 8.3 శాతానికి మెరుగుపడింది. ఫైనాన్షియల్ ఇయర్ మెుదటి ఆరు నెలల కాలంలో నికర లాభం రూ.1433 కోట్లకి చేరుకోగా.. గత ఏడాది ఇదే కాలంలో రూ.1282 కోట్లుగా నమోదైంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో డీమార్ట్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.4570 వద్ద ప్రయాణాన్ని ముగించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.97 లక్షల కోట్లుగా ఉంది.
వాస్తవానికి కంపెనీ 2002లో తన తొలి స్టోర్ మహారాష్ట్రలో ప్రారంభించటంతో ప్రస్థానాన్ని మెుదలు పెట్టింది. జూన్ నెల చివరి నాటికి కంపెనీ స్టోర్లు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, NCR, ఛత్తీస్‌గఢ్, డామన్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెుత్తం స్టోర్ల సంఖ్య 371గా ఉన్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications