Q1 Results: దేశంలోని రిటైల్ వ్యాపారంలో రాధాకిషన్ దమానీ కింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లకు మాత్రమే పరిచయం ఉన్న ఆయన పేరు ప్రస్తుతం అవెన్యూ సూపర్ మార్ట్స్ పేరుతో డీమార్ట్ స్టోర్లను నిర్వహించటంతో సామాన్యులకు సైతం తెలిసింది. కంపెనీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన రిటైల్ చైన్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
డీమార్ట్ స్టోర్లను దేశంలో నిర్వహిస్తున్న సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ నేడు తన మెుదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య త్రైమాసికంలో కంపెనీ రూ.773.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నమోదు చేసిన రూ.658.8 కోట్ల లాభం కంటే ప్రస్తుతం నమోదైన లాభాలు 17.5 శాతం అధికం. అలాగే కంపెనీ కార్యకలాపాల ద్వారా ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.11,865.4 కోట్లుగా ఉండగా ప్రస్తుతం 18.6 శాతం పెరిగి రూ.14,069.1 కోట్లకు చేరుకుంది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ల ధర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Q1FY25లో EBITDA ముందు ఆదాయాలు రూ.1,221.3 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.1,035.3 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో జనరల్ మర్చండైజ్ అండ్ అపెరల్ నుంచి సహకారం మెరుగుపడటం కొనసాగిందని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ CEO & MD నెవిల్లే నోరోన్హా పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా దేశవ్యాప్తంగా 6 స్టోర్లను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో జూన్ 30, 2024 నాటికి దేశంలో కంపెనీ మొత్తం స్టోర్‌ల సంఖ్య 371కి చేరుకుంది.
డిమార్ట్ రోజువారీ తక్కువ కాస్ట్ - రోజువారీ తక్కువ ధర వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇది పోటీ ధరలకు వస్తువులను సేకరించడం, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా పోటీ ధరలకు విక్రయిస్తోంది. ఇది వినియోగదారుల డబ్బుకు విలువను అందించటం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన సేవల స్థాయిలను మెరుగుపరచడం, భవిష్యత్తు కోసం సామర్థ్యాన్ని పెంపొందించడంపై నిరంతర ప్రయత్నం కారణంగా నిర్వహణ ఖర్చులు పెరినట్లు పేర్కొంది. శుక్రవారం మార్కెట్ల క్లోజింగ్ సమయంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.4,953.35 వద్ద ముగిసింది. ఇది గురువారం ముగింపు కంటే 1.15 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications