Radhakishan Damani: దేశీయ స్టాక్ మార్కెట్లలో రాధాకిషన్ దమానీ ఒక ప్రముఖ ఇన్వెస్టర్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆయన డీమార్ట్ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం సామాన్యులకు సైతం ఆయన పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
దేశంలోని ప్రముఖ రిటైల్ చైన్ స్టోర్లను దమానీ కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిడెట్ డిమార్ట్ పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక పెద్ద ప్లాట్‌ను కొనుగోలు చేసింది. సుమారు 1.2 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ ముంబైలోని చండీవాలిలో ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా కింద వచ్చే దీనిని దమానీ ఏకంగా రూ.117 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. రానున్న కాలంలో ఇక్కట రిటైల్ షాపింగ్ సెంటర్ లేదా కమర్షియల్ బిల్డింగ్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ ప్లాట్‌ఫామ్ CRE మ్యాట్రిక్స్ నివేదిక ప్రకారం అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కంపెనీ దీనికోసం మే 6న ఒప్పందంపై సంతకం చేసిందని వెల్లడైంది. ఈ డీల్ కోసం దమానీ స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.7.03 కోట్లు చెల్లించారు. అయితే దీనిపై ఇప్పటి వరకు అటు కంపెనీ నుంచి కానీ లేదా ఇదు బిలియనీర్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ రాధాకిషన్ దమనానీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక సంవత్సరంలో 40 కొత్త స్టోర్లను తెరవాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ యాజమాన్యం గత ఏడాది తెలిపింది. స్టోర్ల విస్తరణలో ఉన్న కంపెనీ గత వారం గుజరాత్ వల్సాద్‌లోని అబ్రామాలో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో కంపెనీ మెుత్తం స్టోర్ల సంఖ్య 367కి చేరుకుంది.
డీమార్ట్ స్టోర్ల ప్రస్థానం 2002లో ముంబై పోవైలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రారంభించిన తొలి స్టోరుతో మెుదలైంది. ప్రస్తుతం కంపెనీ తన స్టోర్లను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో విజయవంతంగా నిర్వహిస్తోంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ డీమార్ట్, డీమార్డ్ ప్రీమియా, డీమార్ట్ మినీమ్యాక్స్, డోమ్స్, డచ్ హార్బర్ వంటి సొంత బ్రాండ్‌లను కలిగి ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో డీమార్ట్ లాభాలు ఏడాది ప్రాతిపదికన 22.39 శాతం పెరిగి రూ.563 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం పెరిగి రూ.12,727 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications