అవెన్యూ సూపర్ మార్ట్స్ (డిమార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ సంపద 2022 క్యాలెండర్ ఏడాదిలో తగ్గింది. మార్చి 31, 2022 నాటికి దమానీకి 14 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతం వాటా ఉంది. వీటి విలువ ఇప్పుడు రూ.1.55 లక్షల కోట్లు. అయితే 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభం సంపదతో పోలిస్తే ఇది 23 శాతం తక్కువ. డేటా ప్రకారం డిసెంబర్ 31, 2021 నాటికి దమానీ సంపద రూ.2.02 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ.1.55 లక్షల కోట్లకు చేరింది.
ఇదిలా ఉండగా, దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, మే 27) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 54,252 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 420 పాయింట్ల లాభంతో ఆరంభించింది. అయితే కాసేపటికి భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా టెక్ స్టాక్స్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

అంతర్జాతీయ మార్కెట్ సానుకూలత నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి ఆరంభ భారీ లాభాలు తగ్గినప్పటికీ, లాభాల్లోనే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడుతుండటం సూచీలకు కలిసి వచ్చే అంశం. చమురు ధరలు పెరగడం మాత్రం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. సెన్సెక్స్ ఉదయం 54,671 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,791 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,464 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 500 పాయింట్లకు పైగా లాభాల్లో కనిపించింది. మధ్యాహ్నం సమయానికి లాభాలు తగ్గాయి. మధ్యాహ్నం గం.11.25 సమయానికి సెన్సెక్స్ 298 పాయింట్లు లాభపడి 54,551 పాయింట్ల వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 16,257 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications