Radhakishan Damani: డీమార్ట్ సంస్థ యజమాని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా గురువు రాధాకిషన్ దమానీ. బిగ్ బుల్ మరణం తరువాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు ఈయన పోర్ట్ ఫోలియోను అనుకరిస్తున్నారు. అయితే ఆయన పెట్టుబడిపెట్టిన ఒక కంపెనీ పెట్టుబడిని ఏకంగా రెండిందలు చేసింది.

పైసా డబుల్ చేసిన స్టాక్..
ఆర్థిక పరిస్థితులు మందగించిన తరుణంలో గత ఏడాది మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అయితే ఈ తరుణంలో కొన్ని క్వాలిటీ స్టాక్స్ మంచి రాబడులను అందించాయి. ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ పెట్టుబడిపెట్టిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ షేర్ కూడా ఈ కోవకు చెందినదే. ఇది మల్టీబ్యాగర్ రాబడులతో డబుల్ లాభాలను అందించింది. ఈ కాలంలో షేర్ విలువ రూ.157.65 నుంచి రూ.322.65కి పెరిగింది. అయితే ఈ సంవత్సరం ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ షేర్ ధర ఎలా ఉందో తెలుసుకుందాం?

గరిష్ఠానికి చేరుకున్న స్టార్..
ఈ రోజు కంపెనీ షేర్లు 2.50 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.322.65కి చేరాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం షేర్లను అమ్మటంతో స్టాక్ కొంత తగ్గింది. ఉదయం 11:40 గంటలకు కంపెనీ షేర్ రూ.323.45 వద్ద ట్రేడవుతోంది. దమానీ పెట్టుబడి పెట్టిన ఈ స్టాక్ రానున్న కాలంలో మరింత రాబడులను ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

పెట్టుబడిపై రాబడి..
గత నెల రోజుల్లో కంపెనీ షేరు ధర రూ.245 నుంచి రూ.322.65కి పెరిగింది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే కంపెనీ షేర్లు 30 శాతం రాబడిని అందించింది. అదే 6 నెలల కాలాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రా మైక్రోవేవ్ షేర్ రూ.175 స్థాయి నుంచి రూ.322 స్థాయికి పెరిగింది. అంటే.. షేర్ అత్యధికంగా 80 శాతం జంప్ చేసింది. 2022 ప్రారంభంలో కంపెనీ షేరు ధర రూ.233 నుంచి రూ.322.65కి చేరుకుంది.

దమానీ పెట్టుబడులు ఇలా..?
ఏప్రిల్ నుంచి జూన్,2022 మధ్య షేర్ హోల్డింగ్ వివరాలను పరిశీలిస్తే.. రాధాకిషన్ దమానీ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కంపెనీలో 8,96,387 షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీలో ఆయనకు మెుత్తం 1.03 శాతం వాటా ఉంది. అంతకు ముందు క్వార్టర్ లోనూ దమానీ ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే రాధాకిషన్ దమానీకి ఈ కంపెనీపై ఎంత నమ్మకం ఉందో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications