VST Industries: దేశంలో డీమార్ట్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న రాధాకిషన్ దమానీ అందరికీ సుపరిచితులే. అలాగే స్టాక్ మార్కెట్ల ప్రపంచంలో ప్రముఖ పెట్టుబడిదారునిగా చాలా మందికి తెలుసు. అయితే ప్రస్తుతం ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పెద్ద బహుమతిని ప్రకటించింది.
రాధాకిషన్ దమానీ ఇన్వెస్ట్ చేసిన VST ఇండస్ట్రీస్ తన పెట్టుబడిదారులకు పెద్ద శుభవార్త వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు 10:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వడానికి ఆమోదించింది. కంపెనీ ప్రతి ఒక్క షేరుకు 10 బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఉచితంగా బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడం ఇదే తొలిసారి. ఇందుకోసం రికార్డు తేదీని ఆగస్టు 30గా నిర్ణయించింది. ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ VST ఇండస్ట్రీస్‌పై పెద్ద పందెం వేశారు.

రాధాకిషన్ దమానీ ఇటీవలే VST ఇండస్ట్రీస్‌లో తన వాటాను తగ్గించుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కంపెనీ బోనస్ షేర్ల ప్రకటనకు ముందు దమానీ కంపెనీలో ఉన్న 2.26% వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించింది. వీఎస్టీలో వాటలను విక్రయించిన తర్వాత కూడా దమానీకి 35%ను కలిగిన అతిపెద్ద వాటాదారుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దమానీ కంపెనీలో 535185 షేర్లను కలిగి ఉన్నారు. దమానీ తన పెట్టుబడి సంస్థలైన బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్స్, డెరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్, దమానీ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా VST ఇండస్ట్రీస్‌లో వాటాలను హోల్డ్ చేస్తున్నారు.
వాస్తవానికి కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లలో మంచి పెరుగుదల నమోదైంది. సిగరెట్, పొగాకు ఉత్పత్తుల పరిశ్రమకు అనుబంధంగా ఉన్న VST ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం నాడు 7 శాతంపైగా పెరిగి రూ.4,290కి చేరాయి. దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను రేట్లను పెంచకపోవటంతో ఈ రంగంలోని కంపెనీల షేర్లు భారీగా లాబపడ్డ సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 10.49 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో 2.83 శాతం పెరిగి రూ.4,102 వద్ద కొనసాగుతున్నాయి.
కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి ధర ఒక్కోటి రూ.4,850గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో VST ఇండస్ట్రీ ఆదాయం 3.5% క్షీణించి రూ.321.33 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ EBITDA మార్జిన్ గతేడాది 31.6% నుంచి 22.8%కి తగ్గింది. జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 36% క్షీణించి రూ.53.58 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications