Q3 Results: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని గుర్తింపు పొందిన రిటైల్ చైన్ డీమార్ట్ తన ఫలితాలను ప్రకటించిందింది.
ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీకి చెందిన కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్. ఇది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. అయితే జనవరి 2న కంపెనీ డిసెంబర్ తో ముగిసిన కాలానికి వ్యాపార ఆదాయం 17.19 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. దీంతో క్యూ3లో మెుత్తం అమ్మకాల ద్వారా ఆదాయం రూ.13,247.33 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కేవలం రూ.11,304.58 కోట్లుగా నిలిచింది.

డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీ దేశవ్యాప్తంగా మెుత్తం 341 స్టోర్లను నిర్వహిస్తోంది. కంపెనీ గడచిన కొన్ని ఏళ్లుగా మార్కెట్లోని ఇతర ప్రముఖ రిటైల్ సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీంతో స్టాక్ మార్కెట్లో అవెన్యూ మార్ట్స్ స్టాక్ సైతం ఒడిదొడుకులను చూస్తోంది. గత ఏడాది కాలంలో 0.77 శాతం మాత్రమే షేర్ ధర పెరిగింది. క్యూ2లో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.623.35 కోట్లుగా నమోదైంది. మూడవ త్రైమాసికంలో కంపెనీ దేశవ్యాప్తంగా కొత్తగా 5 స్టోర్లను ప్రారంభించింది.
డీమార్ట్ తాజా ఫలితాలతో దేశంలోని బ్రోకరేజ్ సంస్థలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో HSBC కంపెనీ షేర్లకు BUY రేటింగ్ అందించింది. అలాగే స్టాక్ టార్గెట్ ధరను రూ.4,600గా ప్రకటించింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యాపార నమూనా బలీయమైనప్పటికీ, సంస్థకు కలగలుపు సమగ్రత, నెట్‌వర్క్ స్ట్రాటజీ రీసెట్ అవసరమని బ్రోకరేజ్ తెలిపింది. ఇదే సమయంలో మరో బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కంపెనీ షేర్లకు ఓవర్ వెయిట్ రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.4,471గా నిర్ణయించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications