Avenue Supermarts: దేశీయ స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు రాధాకిషన్ దమానీ, ఆయన కంపెనీ డీమార్ట్ రెండింటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మార్కెట్ బిగ్‌బుల్ దివంగత రాకేష్ జున్‌జున్‌వాలాకు గురువైన దమానీ తన తెలివితేటలను రిటైల్ వ్యాపారంలో సైతం అంతే చురుగా చూపించి అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ పెట్టి డీమార్ట్ పేరుతో స్టోర్లను దేశమంతగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 22.4 శాతం పెరిగినట్లు ప్రకటించింది. దీంతో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.563.1 కోట్లుగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో క్యూ4 లాభం కేవలం రూ.460.1 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి నాలుగో త్రైమాసికంలో రూ.12,727 కోట్లుగా నిలిచింది. ఈ కాలంలో కంపెనీ EBITDA 22.3 శాతం పెరిగి రూ.943 కోట్లుగా నమోదైంది. అలాగే కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 13 బేసిస్ పాయింట్లు పెరిగి 7.41 శాతానికి చేరుకున్నట్లు కంపెనీ తన ఫలితాల్లో వెల్లడించింది.

మార్చి త్రైమాసికంలో సాధారణ వస్తువులు, ఫ్యాషన్ విక్రయాల్లో పెరుగుదల కంపెనీ లాభాల వృద్ధికి దోహదపడింది. వాస్తవానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ల కిందట ప్రారంభించిన స్టోర్లు 9.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ 284 ఇటువంటి స్టోర్లను కలిగి ఉంది. అలాగే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దేశవ్యాప్తంగా కొత్తగా 41 స్టోర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోన్హా తెలిపారు.
ఇదే క్రమంలో కంపెనీ తన ఈ-కామర్స్ వ్యాపారంపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తోంది. తాజాగా గురుగ్రాములో కొత్తగా ఈకామర్స్ సేవలను ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ సేవలందిస్తున్న 23 నగరాల్లో సైతం వీటిని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో డీమార్ట్ స్టాక్ 0.29 శాతం పెరిగి రూ.4,618.45 వద్ద ముగిశాయి. షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.4,890 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠంగా రూ.3,352 వద్ద ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications