లక్షలు జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి అడవుల బాట..కట్ చేస్తే కోట్ల సంపాదన ఇప్పుడు..

అందరూ సాఫ్ట్ వేర్ జాబ్ అనగానే అంతెత్తున ఎగిరి గంతేస్తారు. కాని మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం లక్షలు సంపాదన అందించే సాప్ట్ వేర్ జాబ్ వదులుకున్నాడు.. అడవుల బాట పట్టాడు. కంప్యూటర్లక కన్నా ప్రకృతే చాలా బాగుందని భావించాడు. సాఫ్ట్ వేర్ల కన్నా వణ్యప్రాణులతో అనుబంధం కోసం కెమెరాతో జంగిల్ కు వెళ్లిపోయాడు. అయితేనేమి..ఏదైతే నమ్ముకున్నాడో అదే అతనికిప్పుడు కోట్ల రూపాయల సంపాదనను తెచ్చిపెడుతోంది. సాఫ్ట్ వేర్ కు వచ్చే జీతం కన్నా వందల రెట్లు ఎక్కువగా సంపాదించి సక్సెస్ మార్గంలోకి వెళ్లిపోయాడు. అతనెవరో కాదు.. Wildlife Whisperers అధినేత సాయి కిరణ్ భగవతుల.. ఈ వారం సక్సెస్ స్టోరీ అతనిదే..

తెలంగాణలోని వరంగల్ కు చెందిన సాయి కిరణ్ భగవతుల కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ చదివారు.2010లో పట్టభద్రుడు అయ్యాక హైదరాబాద్, చైన్నై, ముంబై వంటి నగరాలలో బిజినెస్ ఇంటెలిజెన్స్చ డేటా అనలిటిక్స్ రంగాల్లో పనిచేశాడు. అయితే ఇంకా ఉన్నత చదువుల కోసం 2014లో షార్లెట్‌లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంకు వెళ్లాడు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అక్కడే అభ్యసించాడు. అనంతరం అమెరికాలో డేటా అనలిటిక్స్ రంగంలో కొన్నేళ్లపాటు పనిచేశాడు. అయితే ఆ ఉద్యోగం అతనికి అంతగా సంతృప్తి ఇవ్వలేదు.

Hyderabad engineer startup jungle workshops business corporate retreats India quit job success story RS 2 5 crore revenue startup alternative careers India jungle training programs Hyderabad entrepreneur corporate offsite nature workshops unconventional business ideas India startup success story India engineer to entrepreneur journey wilderness workshops India 2 5 Success Story Success Storys Wildlife Whisperers Sai Kiran Sai Kiran Bhagavatula

మనసుకు నచ్చని ఉద్యోగంలో ఉండలేకపోయాడు. ముందు నుంచి కెమెరాను ఇష్టపడిన సాయి అందులోనే తన జీవితాన్ని వెతుక్కోవాలనుకున్నాడు.. అమెరికాను వదిలిపెట్టి ఇండియాకు వచ్చాడు. అమెరికాలో ఉన్నప్పుడే ఖాళీ సమయాల్లో చెట్లు పుట్టలు పట్టుకుని తిరిగేవాడు. USA లోని 49 రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రధాన జాతీయ ఉద్యానవనాలను అతను కవర్ చేశాడంటే ప్రకృతి మీద అతని ప్రేమను అర్థం చేసుకోవచ్చు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ప్రకృతిని కార్పోరేట్ రంగానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఇది 2020లో జరిగింది. కార్పోరేట్ రంగంలో చాలామందికి అడవి అందాలు చూపించాలనుకునే స్టార్టప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా పురుడు పోసుకున్నదే..వైల్డ్‌లైఫ్ విస్పరర్స్. 2023లో స్థాపించిన ఈ సంస్థ టర్నోవర్ ఇప్పుడు కోట్ల రూపాయలను దాటింది. అయితే అది అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. కరోనా మహమ్మారి అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. అయినప్పటికీ తన అడవి ప్రయాణాన్ని ఎక్కడా ఆపలేదు.

ఇప్పుడు ఈ సంస్థ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తోంది. కార్పోరేట్ ప్రపంచంలో పనిఒత్తడితో అలసిపోయిన ఉద్యోగులకు వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ అడవి సాహసయాత్రను పరిచయం చేస్తోంది. వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ ప్రస్తుతం స్వయం నిధులతో రన్ అవుతోంది. దీనిని ప్రవాహా క్రియేటివ్ స్టూడియోస్ LLPగా నమోదు చేశారు. కంపెనీ పెట్టిన తొలి ఏడాదిలోనే రూ. 80 లక్షలను ఆదాయంగా ఆర్జించింది.

కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నగరంలో ఉంది. ఇక (2023-2024) లోనే, వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ వార్షిక ఆదాయం రూ. 2.5 కోట్లు ఆర్జించింది.వచ్చే ఏడాదికి.. ఈ బృందం రూ. 5 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది.దీంతో పాటుగా వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రజలను అడవులకు దగ్గరగా తీసుకురావడం,వారి సహజ జీవన విధానం నుండి నేర్చుకోవడంలో వారికి సహాయపడే దిశలో తన ప్రయత్నాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అయితే కంపెనీ ప్రతినిధులు దేశంలో అన్ని చోట్లా ఉంటారు. వారంతా తరచుగా అడవుల్లో కలుస్తుంటారని చెప్పుకొచ్చారు సాయి. కంపెనీ ప్రస్తుతం ముగ్గురు ప్రధాన సభ్యులతో పాటుగా ఒక జంగిల్ కోచ్, కాంట్రాక్టు మీద పనిచేసే 10 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో అంతా అడవి కి సంబంధించిన దానిలో అనుభవం ఉన్నవారే.ఇప్పుడు కంపెనీని మరింతగా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నారు సాయి.

ఈ కంపెనీ ఇప్పుడు విభిన్న రకాల ప్యాకేజీలను అందిస్తోంది. ది జంగిల్ బుక్-మైండ్ పుల్ నెస్ పేరుతో 2 నుంచి 4 రోజుల సాహసయాత్రను చేపడుతోంది. అలాగే మూవ్ లైక్ ఏ ప్యాక్ పేరుతో ఉద్యోగుల బంధాన్ని బలపరిచేందుకు, సహోద్యోగులతో సరదాగా ఉండేందుకు అడవిలో నిపుణుల మధ్య మరో ప్యాకేజీని అందిస్తోంది. ప్రస్తుతం కార్పోరేట్ రంగానికి పరిమితమైన ఈ స్టార్టప్ అన్ని రకాల కంపెనీలతో టచ్ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని 19 జాతీయ ఉద్యానవనాలకు చెందిన ప్రైవేట్ టూర్ ప్యాకేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు విదేశాల్లో ఉన్న ఉద్యానవనాలకు సంబంధించిన ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

కంపెనీ అధినేత సాయి కిరణ్ భగవతుల ఏమంటారంటే..మనం ప్రకృతి నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.అలాగే జంతువులతో పాటు మనుషుల నుండి కూడా చాలా నేర్చుకోవాలని చెబుతున్నారు. బలహీనమైన వాటిపై దాడి చేస్తాం. అలాగే బలమైన వాటిని చూసి పారిపోతాం అని చెబుతుంటారు. మనుషులు కార్పోరేట్ యంత్రాలు కాకూడదు. అప్పుడప్పుడు విశ్రాంతి కావాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని ధ‌ృఢంగా ఉంచుకోవాలని తెలిపారు. మనం ఇష్టపడేదాన్ని మాత్రమే మనం సంరక్షిస్తాము. మనం అర్థం చేసుకున్నదాన్ని మాత్రమే ప్రేమిస్తాము. మనకు బోధించబడినదాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుంటామని ఫిలాసపీ చెబుతుంటారు సాయి.

కార్పొరేట్ ప్రపంచం..దేవుడు ఇచ్చిన అడవుల అందాల ప్రపంచాన్ని కలవాలని నేను కోరుకున్నాను. అడవిలో ప్రకృతి, వన్యప్రాణుల మధ్య ఉండటం ద్వారా ఉద్యోగులు చాలా నేర్చుకోగలరని, గ్రహించగలరని నాకు తెలుసు.అందుకే నేను నా ఆలోచనను ప్రముఖ సీరియల్ వ్యవస్థాపకురాలు, ప్రఖ్యాత బ్రాండ్ కన్సల్టెంట్ శ్రీమతి అర్పితా ఖాద్రియాతో పంచుకున్నాను.ఆమె ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. అందులో అన్ని రకాల వాటిని ఆస్వాదిస్తుంది. అందుకే ఆమె నాకు వైల్డ్‌లైఫ్ విస్పరర్స్‌కు గురువు, సహ యజమాని అయ్యారని స్టార్టప్ వ్యవస్థాపకుడు సాయి కిరణ్ చెబుతుంటారు. వైల్డ్‌లైఫ్ విస్పరర్స్..

కార్పొరేట్ ప్రపంచాన్ని అడవులకు ఎలా పరిచయం చేస్తుందంటే..

ఏదైనా కంపెనీ HR ప్రతినిధి వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి అందించే వారు కార్యక్రమాలు, వర్క్‌షాప్‌ల జాబితాను తనిఖీ చేయవచ్చు.అనంతరం వారు ఇచ్చిన ఇమెయిల్, ఫోన్ నంబర్‌ ద్వారా మీ ప్లాన్ వివరాలు చెప్పవచ్చు. ఒకే అనుకుంటే వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ బృందం క్లయింట్‌తో సంప్రదింపు కాల్‌ను ఏర్పాటు చేస్తారు.ఇక్కడ కంపెనీ ప్రతినిధులు వర్క్‌షాప్ యొక్క ఉద్దేశ్యం చెప్పాలి. వారి ఉద్దేశాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని వైల్డ్‌లైఫ్ విస్పరర్స్ బృందం తయారుచేస్తుంది. అడవిని ఎంచుకోవడం నుండి వర్క్‌షాప్ టెంప్లేట్, షెడ్యూల్ రూపకల్పన ఇలా ప్రతీ అంశంలో కంపెనీ CEOతో అనుసంధానమై చేస్తారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంటారు.

ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ విస్పరర్స్... ఎలిఫెంట్ విస్పరర్ (లీడర్‌షిప్), ది జంగిల్ బుక్ (మైండ్‌ఫుల్‌నెస్), వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (టీమ్‌వర్క్), ది లయన్ కింగ్ (బిజినెస్ ఎక్సలెన్స్), ఐ ఆఫ్ ది టైగర్ (డెసిషన్ మేకింగ్) వంటి ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వైబ్ సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

వైబ్ సైట్ ఇదే.. https://www.wildlifewhisperers.com/

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+