Multibagger Stock: మల్టీబ్యాగర్ రాబడులను అందించే స్టాక్స్ గురించి మనం చాలా రంగాల్లో చూస్తుంటాం. అయితే మీడియా రంగంలో ఇలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి. అసలు స్టాక్ మార్కెట్లో రాబడులు పొందటానికి సరైన ఎంపికతో పాటు దీర్ఘకాలం వాటిని హోల్ట్ చేయటం అని వింటూ ఉంటాం. అందుకు ఈ స్టాక్ సరైన ఉదాహరణగా నిలుస్తోంది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీడియా రంగంలో మంచి గుర్తింపు కలిగిన క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ స్టాక్ గురించే. అవును ప్రస్తుతం ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను సైతం పొందారు. నమ్మి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు 5 ఏళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 1517 శాతం రాబడిని అందించింది.

కంపెనీ ఆదాయం..
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.19.73 కోట్ల రాబడిని నమోదు చేసింది. గత సంవత్సరం కంపెనీ ఇదే కాలంలో రూ.14.39 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో ఆదాయం 37 శాతం పెరిగింది. Q2FY23తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4.55 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈనెల 30న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరగనుంది.

ఇన్వెస్టర్లకు లాభాలు..
క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ షేర్లు గత శుక్రవారం రూ.304 వద్ద ముగిశాయి. అయితే ఈరోజు ఉదయం 10.20 గంటల సమయంలో స్టాక్ 1.50 శాతం లాభపడి రూ.308 వద్ద ట్రేడ్ అవుతోంది. 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 1,517 శాతం రాబడులను అందించిన స్టాక్.. గత మూడేళ్లలో 318 శాతం రాబడిని అందించింది. అయితే 2022లో స్టాక్ ధర 19.64 శాతం క్షీణించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.666 కోట్లుగా ఉంది.

అదానీ వాటాలు..
మీడియా రంగంలోకి అరంగేట్రం చేసిన అదానీ క్వింట్ మీడియాలో వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీని విలువ ఎంత అనే విషయాలు బయటకు వెల్లడికాలేదు. 1985లో ప్రారంభమైన క్వింట్ సంస్థలో దాదాపు 179 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీడియా రంగంలో మంచి గుర్తింపు కలిగి ఈ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.315.80 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.305.10గా ఉంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications