Quick Commerce: ఇ-కామర్స్ విభాగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్న పలు సంస్థలు క్రమేపీ వృద్ధి అంచనాలు ఎక్కువగా ఉన్న క్విక్ కామర్స్ రంగంలోనూ తమ మార్కు చూపించేందుకు తహతలాడుతున్నాయి. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలు ఈ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఇటీవల దేశీయ ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఫ్లిప్‌కార్ట్ మినిట్స్' పేరిట యూజర్లకు క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేందుకు రెడీ అయింది. అయితే మొదటగా కొన్నిసెలెక్టెడ్ ప్రాంతాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
బెంగళూరుకు చెందిన సన్నీ గుప్తా అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌తో తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేశారు. క్విక్ కామర్స్ విభాగంలో ఇ-కామర్స్ దిగ్గజం సర్వీస్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం 13 నిమిషాల్లోనే తాను ఆర్డర్ చేసిన ల్యాప్‌టాప్‌ను కూర్చున్న చోటు నుంచి కదలకుండా డెలివరీ పొందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. మొదట ఆర్డర్ చేసిన వెంటనే 5 నిమిషాల్లో డెలివరీ ఇవ్వనున్నట్లు యాప్ లోచూపించిందని తెలిపారు. అనంతరం కొంత ఆలస్యం అవుతుందని టైం అప్డేట్ అయినట్లు వెల్లడించారు. ఎట్టకేలకు స్టార్‌బక్స్ లో ఉండి ఆర్డర్ చేయగానే అక్కడికే ల్యాప్‌టాప్ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చినట్లు వివరించార.

ల్యాప్‌టాప్ అన్ బాక్సింగ్ తర్వాత గుప్తా ఇతర వివరాలు పంచుకున్నారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ అక్కడికి వచ్చేందుకు 3 నిమిషాలు సమయం పట్టినట్లు చెప్పారు. వీడియో ఆధారంగా ఏసర్ ప్రిడేటర్ లాప్టాప్ ప్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో దాని కాస్ట్ 95 నుంచి 2.5 లక్షల మధ్య ఉంటుందని అర్థమవుతోంది. ప్రత్యర్థి కంపెనీలైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ నౌ వంటి వాటిలో భారీ రేంజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లకు చోటులేదు. కానీ వారికి భిన్నంగా ఫ్లిప్‌కార్ట్ ఈ తరహా ప్రొడక్ట్స్‌ని కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే అందిస్తుండం అడ్వాంటేజ్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పోస్ట్ పై నెట్టింట్లో పలువురు అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ తన స్థాయిలో పనితీరును మెరుగుపరచుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యపడుతున్నారు. ఇటీవల 4 రోజుల్లో డెలివరీ కావాల్సిన మొబైల్ కాస్తా 15 రోజుల్లో వచ్చిందని. అప్పటినుంచి ఆ ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్ చేయడం మానేసినట్లు మరొకరు తమ అనుభవాన్ని వివరించారు. 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వాల్సిన అత్యవసరమైన ప్రోడక్ట్ ల్యాప్‌టాప్ కాదని మరొకరు అభిప్రాయపడ్డారు. కాంపిటీషన్ పెరిగితే ఇలాంటి అద్భుతాలు మరెన్నో చూడవచ్చు అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications