Zepto News: వినాయకచవితికి జెప్టోలో ఆర్డర్లు సునామీ.. హైదరాబాదీలు తగ్గలా..
Zepto Ganesh Chaturdhi: దేశీయంగా క్విక్ కామర్స్ యాప్స్ ప్రస్తుత కాలంలో వేగంగా ప్రజాధరణ పొందుతున్నాయి. పండుగ ఏదైనా, అవసరం ఎలాంటిదైనా కేవలం నిమిషాల్లో ఆర్డర్లు పెట్టడం నుంచి వేగంగా వాటిని డెలివరీ వరకు ఈ రంగంలోని కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. పైగా ఇంటి వద్దకే క్షణాల్లో కోరుకున్నది రావటంతో వీటిపై వినియోగదారులకు మక్కువ పెరుగుతోంది.
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ జెప్టో గత ఏడాదితో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి వినాయకుడి విగ్రహాల అమ్మకాల్లో 10 రెట్లు పెరుగుదలను చూసింది. డిమాండ్‌లో పెరుగుదల సంప్రదాయ, అనుకూలమైన పండుగ పరిష్కారాల వైపు విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుందని కంపెనీ తెలిపింది. అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెడీమేడ్ మోడక్‌లు గంటకు 1,500 చొప్పున ఆర్డర్లు అందుకోగా, మోడక్ అచ్చులు గంటకు 500 స్థిరమైన ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఇక పండుగ నాడు స్వీట్స్ ఆర్డర్ల విషయంలో బెంగళూరు నగరం మెుదటి స్థానంలో నిలిచింది. ఇది మెుత్తం స్వీట్స్ ఆర్డర్లలో 25 శాతాన్ని కలిగి ఉంది. ఇదే క్రమంలో మిగిలిన నగరాలను పరిశీలిస్తే మెుత్తం ఆర్డర్లలో ముంబయి 18%, దిల్లీ NCR 17%, హైదరాబాద్ 12%, చెన్నై 6% కలిగి ఉన్నాయి. అలాగే జెప్టో 2024 గణేష్ చతుర్థికి దేశమంతటా 10,000 మట్టి విగ్రహాలను విక్రయించింది. 100% పర్యావరణ అనుకూల విగ్రహాలలో ప్రత్యేకత కలిగిన స్వస్తితో భాగస్వామ్యంతో జెప్టో 100 మందికి పైగా స్థానిక కళాకారులను శక్తివంతం చేసింది.
జెప్టో పండుగ సందర్భంగా గడచిన 24 గంటల సమయంలో మెుత్తం 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదక్ అమ్మకాల్లో ముంబై ముందంజలో ఉంది. ఇక బెంగుళూరు పెడాస్‌కు ప్రాధాన్యతనివ్వగా, దిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రజలు లడ్డూల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టారు. దీంతో జెప్టోలో మోడక్‌లు 5x పెరుగుదలను, లడ్డూలు 2.5x ఆర్డర్ల వృద్ధిని చూసింది. ఇక పూజా అవసరాలకు ఆర్డర్లు కూడా 2 రెట్లు పెరిగాయి. కంపెనీ తన సేవలతో దేశంలోని క్విక్ కామర్స్ కంపెనీల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ వ్యాపార సంస్థగా నిలిచింది.


Click it and Unblock the Notifications