Blinkit Apple Products: దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ కంపెనీలు రోజురోజుకూ తమ వ్యాపారాన్ని విస్తరించటానికి అనేక కేటగిరీలతో పాటు కొత్త ఉత్పత్తులను యాడ్ చేస్తూ పోతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల కిందట ప్రముఖ స్టార్టప్ జెప్టో స్కోడా కార్లను డెలివరీ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద సంచలనానికి నాంది పలికిన సంగతి తెలిసిందే.
ఒకపక్క క్విక్ కామర్స్ కంపెనీలు లాభాలు రాకపోయినప్పటికీ వ్యాపార పోటీని దూకుడుగా పెంచుకుంటూ పోతుంటే మరోపక్క చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక నష్టాలతో కనుమరుగైపోతున్నారు. ఈ క్రమంలోనే జొమాటో యాజమాన్యంలో పనిచేస్తున్న క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆపిల్ ఉత్పత్తులు, యాక్సిసరీస్ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు సిద్ధమైందని బ్లింకిట్ సీఈవో ట్విట్టర్ వేదికగా నేడు ప్రకటించారు.

బ్లింకిట్ తాజా సేవల్లో భాగంగా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, ఇతర ఆపిల్ ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయగలరని బ్లింకిట్ CEO అల్బిందర్ దిండ్సా వెల్లడించారు. దీంతో కంపెనీ కేటలాగ్‌ను విక్రయిస్తుందని ఆయన పేర్కొన్నారు. దిల్లీ ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఈ ఆపిల్ ఉత్పత్తుల డెలివరీలు స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
బ్లింకిట్ వినియోగదారులు ఇప్పటికే ఐఫోన్‌లు, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గేమింగ్ కన్సోల్‌లు, కీబోర్డ్‌లు 10 నిమిషాల డెలివరీ కింద టెక్ యాక్సెసరీలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఐప్యాడ్ 10వ తరం, ఆపిల్ ఇయర్‌పాడ్‌లు వంటి కొన్ని ఉత్పత్తులు ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో త్వరలోనే డెలివరీలను స్టార్ట్ చేయనున్నట్లు బ్లింకిట్ యాప్ వెల్లడించింది.
జెప్టో ఏం చేసిందంటే..?
జెప్టో తన యాప్ ద్వారా యూజర్లు స్కోడా కార్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. జెప్టో వీటిని స్వయంగా ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే స్కోడా ఇండియాతో జతకట్టినట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో టీజర్ రూపంలో విడుదల చేసింది. వీడియోలో షోరూమ్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్‌ని తన "ఆర్డర్" వైపు నడిపిస్తున్నట్లు చూపించింది. ఇందులో కంపెనీ కొత్తగా విడుదల చేసిన సబ్-కాంపాక్ట్ SUV స్కోడా కైలాక్ కనిపించింది. కంపెనీ ఈ కొత్త సేవలను ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications