Zepto News: క్విక్ కామర్స్ వ్యాపారంలో పెను సంచలనాలు సృష్టిన సంస్థ జెప్టో. దీనిని 22 ఏళ్ల స్నేహితులు ఇద్దరు కలిపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు ఇదే వ్యాపారంలోకి వేగంగా అడుగులు వేస్తుండటంతో జెప్టో వ్యవస్థాపకులు కొత్త ప్లాన్స్ వేస్తున్నారు.
తాజాగా జెప్టో మార్కెట్ నుంచి పెద్ద రౌండ్ నిధులను విజయవతంగా సేకరించినట్లు వెల్లడించింది. కంపెనీ 3.6 బిలియన్ డాలర్ల విలువతో తాజాగా 665 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. కంపెనీ వీటిని జొమాటోకి చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, టాటా డిజిటల్ బిగ్ బాస్కెట్‌లతో కంపెనీలతో పోటీ పడేందుకు, వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు దోహదపడనుంది. వ్యాపారంలో దూకుడు మీద ఉన్న స్టార్టప్ ఇప్పటికే అనేక కంపెనీలను మార్కెట్లో కనుమరుగయ్యేలా తన పోటీని కొనసాగించిన సంగతి తెలిసిందే.

జెప్టో ఈ ఫండ్‌ను ప్రస్తుత పెట్టుబడిదారులైన గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్, స్టెప్‌స్టోన్ గ్రూప్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, గుడ్‌వాటర్ క్యాపిటల్, లాచీ గ్రూమ్ నుంచి సేకరించింది. అలాగే ఈ రౌండ్ ఫండ్ రైజింగ్‌లో కంపెనీ పెట్టుబడిదారులైన DST గ్లోబల్, అవెనిర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్ అండ్ అవ్రాలను కూడా జోడించింది. సమాచారం ప్రకారం తాజా రౌండులో 40 శాతం నిధులను కొత్త పెట్టుబడిదారులు జెప్టోకు సమకూర్చినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య పాలిచా వెల్లడించారు. రానున్న ఏడాది కంపెనీ మార్కెట్లోకి ఐపీవో ఫ్లోట్ చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
వాస్తవానికి కరోనా సమయంలో వచ్చిన కంపెన వేగంగా మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించింది. క్విక్ కామర్స్ రంగంలో జెప్టోను 22 ఏళ్ల స్టాన్‌ఫోర్డ్ డ్రాపౌట్స్ ఆదిత్య పాలిచా, కైవల్య వోహ్రోలు 2021లో ప్రారంభించారు. అప్పటి నుంచి స్టార్టప్ కంపెనీ అనేక రౌండ్లలో దాదాపు 1.2 బిలియన్ డాలర్ల నిధులను పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ 1.4 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
కంపెనీ మార్చి 2025 నాటికి 700 వివిధ నగరాల్లో డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 10 నగరాల్లో 350 డార్క్ స్టోర్లు ఉన్నాయి. రానున్న రెండేళ్లలో వీటిని డబుల్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుండగా ప్రస్తుత రౌండ్ ఫండింగ్ దానికి తోహదపడనుందని తెలుస్తోంది. కంపెనీ అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్ వంటి నగరాలకు విస్తరించాలని యోచిస్తుండగా.. ఇందులో భాగంగా రానున్న కొన్ని నెలల్లో కొత్తగా 1600-2000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications