Dunzo: అంబానీ కంపెనీలో సంక్షోభం.. ఉద్యోగులకు చెల్లించని నవంబర్ జీతాలు..!!
ఒకప్పుడు వెలుగువెలిగిన స్టార్టప్ కంపెనీలు ప్రస్తుతం తమ ఉద్యోగులకు జీతాలను సైతం అందించలేని స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి.
దేశంలో కిరాణా సామాన్లు నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపారంలో ఉన్న డన్జో పరిస్థితి ప్రస్తుతం దిగజారింది. ఈ కంపెనీలో ముఖేష్ అంబానీ భారీగానే పెట్టుబడులను కలిగి ఉన్నారు. కంపెనీ ఏడాది ప్రారంభంలో రెవెన్యూ ఫైనాన్సింగ్ సంస్థ OneTapతో భాగస్వామ్యం చేసినప్పటికీ.. ప్రస్తుత ఉద్యోగులకు నవంబర్ జీతాలు చెల్లించడంలో విఫలమైంది.

ఉద్యోగులకు వచ్చే వారం ప్రారంభంలో ఆశించిన నిధులు వస్తాయని తమ పెట్టుబడిదారు నుండి హామీ లభించినట్లు కంపెనీ వారం ప్రారంభంలో వెల్లడించింది. ఆ వెంటనే పెండింగ్ నవంబర్ జీతాలను చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా డబ్బు జనవరిలో ఈక్విటీ రౌండ్ ముగిసే వరకు రెండు నెలల పాటు వేతనాల చెల్లింపులకు సరిపోతుందని కంపెనీ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆలస్యానికి చింతిస్తున్నట్లు ఉద్యోగులకు తన అభ్యర్థనలో పేర్కొంది.
స్టార్టప్ డన్జో ఈ ఏడాది ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను చాలాసార్లు ఆలస్యం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు ప్రారంభం వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని కంపెనీ మొదట చెప్పింది. నిధులను సేకరించలేక అక్టోబరు మొదటి వారానికి జీతాలను ఆలస్యం చేసింది. ఆ తర్వాత కూడా ఫండ్ క్రంచ్ కొనసాగుతున్నందున నవంబర్ జీతాలను సైతం ఆలస్యం చేసింది. అలాగే ఖర్చులను తగ్గించుకునేందుకు గత నెలలో అన్ని ఉద్యోగుల ఖాతాలను Google Workspace నుంచి Zohoకి మార్చింది. FY23లో కంపెనీ రూ.1,800 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 288 శాతం అధికం.


Click it and Unblock the Notifications