Gold News: ఈసారి అక్షయతృతీయ రోజున పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చాయి. దీంతో చాలా మంది తమ సెంటిమెంట్ కొనసాగించేందుకు చిన్న మెుత్తాల్లో బంగారం కొనుగోళ్లకు దిగారు. షాపులకు వెళ్లి ఆభరణాలను కొన్న వారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు కొంత మందగించినట్లు వ్యాపారులు వాపోయారు. అయితే క్విక్ కామర్స్ వ్యాపారంలోని కంపెనీలు మాత్రం మంచి డిమాండ్ అందుకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. అక్షయతృతీయ రోజున బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్, జెప్టో వంటి కంపెనీలు సూపర్ డిమాండ్ చూశాయి. వస్తువులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపారంలో ఉన్న ఈ ప్రధాన పోటీదారులు బంగారం, వెండి నాణలను భారీగా కస్టమర్లకు డెలివరీ చేశాయి. ఈ క్రమంలో అక్షయతృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కస్టమర్ల ఇంటి వద్ద బంగారం, వెండి నాణేలను అందించడానికి టాటాలకు చెందిన బిగ్‌బాస్కెట్ తనిష్క్, MMTC-PAMPతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇదే సమయంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గోల్డ్, సిల్వర్ కాయిన్స్ డెలివరీ చేసేందుకు మలబార్ గోల్డ్ & డైమండ్స్, ముత్తూట్ ఎగ్జిమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇదే సమయంలో జెప్టో Nek Jewelleryతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ధనత్రయోదశితో పోల్చితే అక్షయతృతీయకు బంగారం, వెంటి కాయిన్స్ కొనుగోళ్లు 500 శాతం వృద్ధిని నమోదు చేశాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ర్టికల్‌కు నాయకత్వం వహిస్తున్న స్విగ్గీ కోఫౌండర్ ఫణి కిషన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇదే క్రమంలో అక్షయతృతీయ రోజున సాయంత్రం 5 గంటల సమయానికి దేశవ్యాప్తంగా తాము 20కేజీల వెండి, బంగారు నాణేలను డెలివరీ చేసినట్లు Zepto కోఫౌండర్, CEO ఆదిత్ పాలిచా వెల్లడించారు. అలాగే బ్లింకిట్‌లో అక్షయ తృతీయ కోసం ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశారు. ఇక్కడ కస్టమర్‌లు బంగారం-వెండి నాణేలు, పూజా సామాగ్రి, పువ్వులు, స్వీట్‌లను ఆర్డర్ చేయవచ్చు. అలాగే తన యాప్‌లో కనీస ఆర్డర్ విలువ రూ.1000పై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. 24k డిజిటల్ బంగారం వన్-టైమ్ కొనుగోలుపై మాత్రమే ఇది వర్తిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications