HDFC-HDFC Bank Merger: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) చారిత్రక విలీనం జూలై 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో HDFC ఆఫీసులు సైతం బ్యాంకు కిందకు రానున్నాయి.
అయితే ఈ విలీనం HDFC నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారిని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై అనేక ప్రశ్నలు ఖాతాదారుల్లో కొనసాగుతున్నాయి. ముందుగా లోన్ ఖాతా నెంబర్లు అలాగే కొనసాగటంతో పాటు లోన్ అగ్రిమెంట్ నిబంధనలు సైతం యథాతథంగా కొనసాగుతాయి. విలీనం తర్వాత HDFC లిమిటెడ్ పోర్టల్‌కి యాక్సెస్‌ను ఉంటుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అందించి గతంలో మాదిరిగానే సేవలను పొందవచ్చు. ఇప్పటికే లోన్ పొంది ఈఎంఐలు ప్రారంభం కాని వారిపై తాజా విలీనం ఎలాంటి ప్రభావం చూపదు. వారి EMI లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందని గమనించాలి.

కస్టమర్లు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. విలీన తేదీ అమలులోకి వచ్చిన తర్వాత లోన్ ఖాతా HDFC బ్యాంక్‌కి బదిలీ చేయబడవచ్చు. అయినప్పటికీ లాగిన్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే HDFC బ్యాంక్‌లో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా లేని కస్టమర్‌లు HDFC బ్యాంక్ వెబ్‌సైట్‌లోని హోమ్ లోన్ సెక్షన్ ద్వారా తమ హోమ్ లోన్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు. ఒక వేళ రుణాన్ని పాక్షికంగా పొందినట్లయితే అవసరమైన వివరాలు తెలుసుకునేందుకు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లొచ్చు లేదా [email protected]కి ఈమెయిల్ పంపి సమాచారాన్ని పొందవచ్చు.
మీ రుణ చెల్లింపులు లేదా ఇతర సహాయం కోసం పాత ఆఫీసులు అందుబాటులోనే ఉంటాయని గుర్తుంచుకోండి. తాజా విలీనం వల్ల చెల్లించే ఈఎంఐలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే పన్ను రాయితీలను పొందటం కోసం కస్టమర్లు లోన్‌పై వడ్డీ సర్టిఫికేట్‌ను వెబ్‌సైట్‌లో కస్టమర్ లాగిన్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెుదటి సారి లోన్ పొందిన తర్వాత 12 నెలలు చెల్లింపులు చేశాక.. టాప్ అప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో లేదా హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా లేదా సమీపంలోని HDFC బ్యాంక్ హోమ్ లోన్ సర్వీసింగ్ బ్రాంచ్‌ని సందర్శించటం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఎలాంటి సందేహాలు వచ్చినా కస్టమర్లు కస్టమర్ కేర్ ద్వారా సలహాలను పొందవచ్చు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications