Quant Small Cap Fund: ఆ కంపెనీల్లో తన పెట్టుబడి పెంచుకున్న క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్..!
క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించే అతిపెద్ద ఫండ్ అయిన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఆగస్టు 2026లో రూ. 35,557 కోట్ల ఏయూఎం కలిగి ఉండగా, సెప్టెంబర్ 2026 నాటికి దాని ఏయూఎం రూ. 35,572 కోట్లుకు పెరిగింది. ఫండ్ హౌస్ వెల్లడించిన నెలవారీ పోర్ట్‌ఫోలియో ప్రకారం ఈ స్మాల్ క్యాప్ ఫండ్ కొనుగోలు, విక్రయించిన స్టాక్‌ల వివరాలు తెలుసుకుందాం. ఈ ఫండ్ తన పోర్ట్‌ఫోలియో నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన 42.65 లక్షల షేర్లను విక్రయించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్, సుమిటోమో కెమికల్ ఇండియా, ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్, ఓస్వాల్ పంప్స్,హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కూడా ఈ ఫండ్ పూర్తిగా నిష్క్రమించింది.
ఈ స్మాల్ క్యాప్ ఫండ్ జైడస్ వెల్నెస్, వెల్స్పన్ కార్పొరేషన్, కెపాసైట్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా), ఎథోస్, సులా వైన్యార్డ్స్లో తన పెట్టుబడులను తగ్గించుకుంది. సెప్టెంబర్‌లో మాక్స్ ఎస్టేట్స్, ఈపీఎల్ లిమిటెడ్, ఏక్వస్, హ్యూబాక్ కలరెంట్స్ ఇండియా, మనీవ్యూ, ప్రభా ఎనర్జీ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరాయి. అదానీ పవర్, ఎమామీ, ఇండీజీన్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్, మణప్పురం ఫైనాన్స్, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్, సోనాటా సాఫ్ట్వేర్, క్యాస్ట్రాల్ ఇండియా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ వంటి కీలక స్టాక్‌లలో ఈ ఫండ్ తన వాటాను పెంచుకుంది.

నెలవారీ పోర్ట్‌ఫోలియో డేటా ప్రకారం సెప్టెంబర్‌లో దాదాపు 82 స్టాక్‌లలో ఎక్స్పోజర్ యథాతథంగా ఉంచింది. గత నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఈ స్మాల్ క్యాప్ ఫండ్‌లోని 104 స్టాక్‌లు యథాతథంగా ఉన్నాయి. నెలవారీ ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం ఈ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథం, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించారు. పోర్ట్‌ఫోలియోలోని అధిక భాగం ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, సాపేక్ష అండర్-ఓనర్షిప్ కలిగిన అధిక వృద్ధి కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది. సెప్టెంబర్ 2026 నాటికి, క్యాపిటల్ గూడ్స్ (+0.77%), మీడియా (+0.57%) రంగాలలో ఎక్స్పోజర్ను పెంచగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ (-2.12%), టెలికాం (-0.60%) రంగాలను తగ్గించినట్లు ఫండ్ హౌస్ తెలిపింది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం సెప్టెంబర్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. ఆగస్టులోని రూ. 29,328 కోట్ల పెట్టుబడులు రాగా.. సెప్టెంబర్ లో రూ. 38,306 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 11 ఉప-విభాగాలలలో స్మాల్‌క్యాప్ ఫండ్లు సెప్టెంబర్‌లో అత్యధికంగా రూ. 9,038 కోట్ల నిధులను ఆకర్షించాయి. మిడ్‌క్యాప్ ఫండ్లు రూ. 7,834 కోట్ల నిధులతో రెండవ అత్యధిక స్థానంలో నిలిచాయి. ఇది గత నెలతో పోలిస్తే 12 శాతం అధికం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications