Mutual Funds: ఇన్వెస్టర్లకు క్వాంట్ ఫండ్ సడన్ సర్‌ప్రైజ్.. ఇకపై పెట్టుబడిదారులకు కొత్త ఫెసిలిటీస్
Quant Mutual Fund: పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత అనువైన సాధనాలుగా మారాయి. మార్కెట్ ఆధారిత రిస్క్ ఉన్నప్పటికీ, అవసరమైన సమయంలో రిడీమ్ చేసుకునే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్య పలు ఫండ్ హౌస్‌లు లిక్విడేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో క్వాంట్ ఫండ్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
వివిధ రకాల పోర్ట్‌ఫోలియోతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు పలు ఆప్షన్స్ అందిస్తోంది. 40 వేల 675 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్న క్వాంట్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ తన పెట్టుబడిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫండ్ హౌస్‌కు సంబంధించిన అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలలో కనీస ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి నుంచి రూ.1కి తగ్గించి ఆశ్చర్యపరిచింది.

'రెండు కారణాల వల్ల రిడెంప్షన్ మొత్తాన్ని తగ్గించాము. మా గణనీయమైన రిటైల్ ఇన్వెస్టర్ బేస్ మరియు వ్యాపారంలో 30 శాతం వాల్యూమ్ కలిగిన టాప్ 30 భౌగోళిక స్థానాల నుంచి ఇందుకోసం డిమాండ్ ఉంది. దానిని తగ్గించేందుకు ఈ సర్దుబాటు అవసరమని భావించాం' అని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది.
యూనిట్లతో పాటు నగదు మొత్తాన్ని ఎంటర్ చేయడం ద్వారా కూడా NAV రిడీమ్ చేసేందుకు క్వాంట్ ఫండ్ ఆప్షన్ ఇచ్చింది. సాధారణంగా డీమ్యాట్ మోడ్‌లో యూనిట్లను రీడీమ్ చేసేటప్పుడు పూర్తి సంఖ్యను ఇన్‌పుట్ చేయాల్సి ఉంటుంది కానీ పాయింట్లు అనుమతించబడవు. ఈ తాజా మార్పుతో పెట్టుబడిదారులు దశాంశ యూనిట్లను కూడా రీడీమ్ చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది.


Click it and Unblock the Notifications